వించెస్టర్ మిస్టరి హౌస్
ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన వారు బయపడకుండా తికమక పడకుండా బయటకు రావడం దాదాపు అసాద్యం 1881 లొ గన్ కనిపెట్టిన ఒలివర్ వించెస్టర్ చనిపోయిన తరువాత అతని బార్య సారా వించెస్టర్ ఈ ఇంటిని కట్టించారు కాని ఆవిడెప్పుడు ప్రశాంతంగా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో నివసించలేదు ప్రతి వారం ఒక కొత్త గదిని కట్టించి అందులోకి మారుతూ ఉండేది ఇలా 1922 లో ఆవిడ మరణించే దాకా అలా 100 కు పైగా గదులు మెట్లు కట్టిస్తున్నే ఉన్నారు వించెస్టర్ కనిపెట్టిన రైఫిల్ వలన మరణించిన వారి ఆత్మలు అమెను వెంటాడతాయని ఆవిడ భయం అలా చాల సార్లు జరిగిందట (కాని అలా వచ్చె ఆత్మలు గోడలనుంచి కూడా వస్తాయి కదా గదులు మారడం వలన ఎలా తికమక పడతాయి) ఆమె మరణించిన తరువాత ఆమె అత్మ కూడా ఈ ఇంట్లొ చాల మందికి కనిపించిందట ఇప్పుడు కాలిఫొర్నియా లోని ఈ ఇల్లు పెద్ద టూరిస్ట్ స్పాట్ ఇప్పటికి ఆత్మని చూశామని రొజుకొకరైనా చెబుతుంటారు

No comments:
Post a Comment