Wednesday, July 8, 2009

భారత ఇంజనీర్లకు గుడ్ న్యూస్

భారత ఇంజనీర్లకు గుడ్ న్యూస్. ఎందుకంటే మన దేశంలోని ఇంజనీర్లు విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలంటే ఇప్పటివరకు విదేశీ విశ్వవిద్యాలయాల డిగ్రీల అవసరం ఉండేది. దీంతో విదేశాలకు వెళ్లే మన వాళ్లు అక్కడ విదేశీ డిగ్రీ అభ్యసించిన తరువాతే ఉద్యోగాల్లో చేరాల్సి వచ్చేది. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండానే భారతీయ ఇంజనీర్లు విదేశాల్లో ఉపాధి పొందవచ్చు. ఇంజనీర్స్ మొబిలిటీ ఫోరంలో భారత ఇంజనీర్ల సంస్థ (ఐఈఐ) సభ్యత్వం ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. ఇటీవలే జరిగిన అంతర్జాతీయ ఇంజనీర్ల సమావేశంలో ఐఈఐ ఈ సభ్యత్వం స్వీకరించింది. దీంతో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా దేశాలకు ఎలాంటి విదేశీ విద్యార్హత లేకుండా మన వాళ్లు అక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించింది. ఎంతైనా ఇది మన ఇంజనీర్లకు గుడ్ న్యూసే కదా మరి... ఈ గుడ్ న్యూస్ తో పాటు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే విదేశాలలో జాత్యాహంకారం మరి పెరిగిపోవడం ఇదంత సద్దుమనిగే దాక మన ఇంజనీర్లు ఎంతటి గుడ్ న్యూస్ ఇచ్చినా విదేశాలలో జాబ్స్ చేయడానికి భయపడుతునే ఉంటారు

No comments:

Post a Comment