Friday, July 10, 2009

అజ్మల్ కసబ్ కి బోరు కొడుతోంది


జైల్లో విసుగేస్తోందని, చదవడానికి పుస్తకాలివ్వండని ముంబై దాడుల కేసు నిందితుడు మొహమ్మద్ అజ్మల్ కసబ్ ప్రత్యేక కోర్టును కోరాడు. 'విసుగేస్తోంది. చదవడానికి పుస్తకాలు అవసరం' అని కసబ్ న్యాయమూర్తి ఎంఎల్ తహలియానితో అన్నాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతను ప్రస్తుతం ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. ముంబాయ్ మీద దాడులకు దిగడమే కాకుండా జైల్లో పుస్తకాలు కోరడం వీడు చాల ఎక్కువ చేస్తున్నట్టు లేదు పుస్తకాలు అడగడమే కాకుండా నేను తెచ్చుకున్న డబ్బు ఇమ్మని లేక పోతే పుస్తకలైనా తెప్పిమంటున్నాడు ఇదంత చుస్తుంటే కసబ్ గాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాట్టులేదు గెస్ట్ గా ఉన్నట్టు భావిస్తున్నాడు చిన్న చిన్న దొంగలని సైతం చితక బాదే మనపోలీసులు ఇలాంటి వారిని మాత్రం ఏమి చెయలేరు దానికి కారణం మన రాజ్యంగం ఏర్పరుచుకున్న లొసుగులు వీటన్నింటికి కారణం.ఈ కేసు ఒక కొల్లిక్కి వచ్చేదాక కసబ్ మనదేశ అథిధిగా హాయిగా గడిపేలా ఉన్నాడు ఇదంత చుస్తు ముంబాయ్ దాడులలో గాయపడ్డ వారు మరణించిన వారి బంధువులు నిశ్ప్రుహతో చుస్తూ ఉరుకోవల్సి వస్తోంది





No comments:

Post a Comment