సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన తర్వాత కూడా ప్రపంచంలో అనేక విషయాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. వీటిపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు నిపుణులు కూడా తగిన వివరణ ఇవ్వలేక పోతున్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోతున్నారు. దీంతో ఇలాంటి విషయాల్లో ప్రజల సందిగ్ధం అలాగే కొనసాగుతోంది. చరిత్రలో ఎందరో ప్రముఖుల మరణాలపై ఇప్పటికీ అనేక సందేహాలున్నాయి. సంవత్సరాలు గడిచినా వీరి మరణాల వెనుకగల కారణాలను నిపుణులు ధృవీకరించలేక పోతున్నారు. ఇవి సాధారణ మరణాలా ? లేక హత్యలా ? లేక ఆత్మహత్యలా ? అన్న విషయాలు తేలడం లేదు. అలాగే ఇవి హత్యలు, ఆత్మహత్యలైతే అందుకు దారితీసిన పరిస్థితులు, ప్రేరేపించిన సంఘటనలపై కూడా విచారణ సాగడంలేదు. ఇటీవలె పాప్‌కింగ్ మైఖేల్జాక్సన్ మృతితో ఈ అనుమానాస్పద మరణ సంఘటనలు మరోసారి తెరపైకివ చ్చాయి. తన నివాసంలోనే జాక్సన్ మృతిచెందినప్పటికీ ఇది సాధారణ మరణం కాదన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. స్లోపాయిజినింగ్ ద్వారా మైఖేల్‌ను అంతం చేసారన్న అనుమానాలు వెలుగుచూశాయి. అయితే ఫోరెన్సిక్ నిపుణులు కూడా దీనిపై ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. మేఖేల్ మెదడును భద్రంగా ఉంచారు. దానిపై మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రానురాను మేఖేల్ మరణం కూడా ఒక అనుమానాస్పద మరణంగానే చరిత్రలో మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం కూడా మేఖేల్ అభిమానుల సందేహాన్ని తీర్చలేక పోతోంది.
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్లీ మరణం కూడా మిస్టరీగానే మిగిలింది. ఈ మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు, డాక్టర్లు సంవత్సరాలకొద్దీ విచారణలు నిర్వహించారు. ఇప్పటికీ వీటి నిగ్గును తేల్చలేక పోయారు. ప్రపంచ బాక్సింగ్ విజేత మహ్మద్ ఆలి మరణం కూడా అనుమానాస్పదంగానే మిగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ఎఫ్ కెనడీని బహిరంగంగానే తుపాకీతో కాల్చి హత్యచేశారు. ఈ హత్యకు దారితీసిన కారణాలు ఇప్పటికీ వెలుగుచూడలేదు. భారత స్వాతంత్య్ర సమర సమయంలో సుభాష్‌చంద్రబోస్ అంతర్ధానంపై కూడా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆయన ఏ విధంగా మాయమయ్యారో ఇప్పటికీ తేలలేదు. ఆయన బ్రతికే ఉన్నారా ? లేక బ్రిటీషీయులు అంతం చేసారా ? అన్నది కూడా ఇతమిద్దంగా తేల్చలేదు. తాష్కంట్‌లో భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి హఠాన్మరణం కూడా అనేక సందేహాలకు తావిచ్చింది. ఆయనది సాధారణ మరణం కాదని విషం కలిపిన ఆహారం వల్లే ఆయన మృతిచెందారన్న ఆరోపణలున్నాయి. అటు సోవియట్, ఇటు భారత్ కూడా శాస్త్రి మృతిపై చేసిన పరిశోధనలను బహిర్గతం చేయలేదు. ప్రభుత్వాలు వెల్లడించిన సమాచారం ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేదు. సాంకేతిక పరమైన ఆధారాలుంటే తప్ప ప్రజలు దేన్నీ నమ్మే పరిస్థితిల్లోలేరు. అలాంటి సాంకేతిక ఆధారాలను ప్రజల ముందుంచడంలో ప్రభుత్వాలు, నిపుణులు విఫలం కావడంతో ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఇటీవలె ఇరాన్‌లో జరిగిన ఎన్నికలు కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయాయి. అక్కడ అధికార పార్టీ తిరిగి గెలిచినప్పటికీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని ప్రజలను ప్రభుత్వం నమ్మించలేక పోయింది. భారత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. దేశం మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను వినియోగించారు. అయితే ఈ మిషన్‌ల టాంపరింగ్‌కు అవకాశం ఉన్నట్లు సందేహాలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాలను ప్రజలు విశ్వసించలేక పోతున్నారు. ఇవిఎమ్‌ల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇవిఎమ్‌ల టాంపరింగ్‌కు అవకాశం ఉందంటూ జనవిజ్ఞాన వేదిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. దీంతో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది.పంచంలో ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్న ప్రముఖుల మరణాలు...1135లో ఇంగ్లాండ్‌రాజు హెన్రీ ఒ విషాహారంతోనే చనిపోయినట్లు సందేహం.
1327లో ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ ఒఒ అతని భార్య విసాబెల్లా, ఆమె ప్రియుడు రోజర్ మార్ట్‌మేర్‌ల చేతుల్లో హత్యకు గురైనట్లు సందేహం.
1556లో మొగల్ సామ్రాట్ హుమాయూన్ మరణం కారణం ఇప్పటికీ తేలలేదు.
1559లో ఫ్రాన్స్ రాజు హెన్రీ ఒఒ ఒక మ్యాచ్ చూస్తుండగా బాణం తగిలి మృతి చెందారు. ఇది ఇప్పటికీ మిస్టరీ మృతిగానే ఉంది.
1599 బర్మారాజు బాయిన్‌నందా నవ్వుతూనే ఆకస్మికంగా చనిపోయినట్లు ప్రపంచానికి వెల్లడించినా ఇంకా ఈ మృతిపై సందేహాలున్నాయి.
1882లో బేస్‌బాల్ క్రీడాకారుడు జింగ్ క్రేగ్‌టర్న్ ఆకస్మిక మృతిపై సందేహం నెలకొంది.
1935లో బేస్‌బాల్ క్రీడాకారుడు లెన్‌కోయిన్‌చే విమానంలో పైలెట్‌తో చోటు చేసుకున్న ఘర్షణలో మృతిచెందాడు.
1960లో జపానీస్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఇనేజిరో అసానుమా మృతిపై ఇప్పటికీ సందేహాలు కొనసాగుతున్నాయి.
1960లో ప్రముఖ పాప్‌సింగర్ ఎల్విస్ ప్రిస్లే మరణం ఇప్పటికీ మిస్టరీగానే వుంది.
1967లో నాసాఅస్ట్రోనాట్స్ గుస్‌గ్రిసం, ఎడ్వయిట్‌రోజర్, బి చాపెల్‌లు అపోలో ఒ స్పేస్‌క్రాఫ్ట్‌లో మృతిచెందడంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
1993లో బ్రూస్లీ కుమారుడు బ్రాండన్‌లీ ది క్రో చిత్ర షూటింగ్‌లో ఉండగా కాల్పులకు గురయ్యాడు. దీని వెనుక కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
No comments:
Post a Comment