విరికి ఇంత ఖర్చు పెట్టి ఏ.సిలు, మైక్ లు అవసరమ వీళ్ళు ఇరువురు మాటమీద నిలబడి ఎవరోవకరు తప్పుకుంటే కొత్త వారికి చాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కొత్తగా వచ్చినా జయప్రకాష్ నారయణ్ కి చిరంజీవి కి తెలిసినంత కూడ తెలికుండ తిట్టుకుంటుంటే వీళ్ళు నాయకులేన అనే అనుమానం కలుగుతుంది వీళ్ళ గురుంచి అందరికి తెలుసు అయిన చెపుతున్నానంటే కొత్తవారు తెలుసుకుంటారని
"కుక్క తోక వంకర" అన్నట్టు ఏన్ని పేపర్లు,టి.వి లు వీడియోలతోసహా వారి పోట్లాటలు చూపించినా వారు మాత్రం తిట్టుకోకుండా ఉండలేరు ఇదంత ఎందుకంటే నేను టి.వి.9లో వీళ్ళ చెత్తవాగుడు చూశాను మర్చిపోయాను ఉత్తినే తెలుగు1 ఓపెన్ చేయగానే హెడ్ లైన్ గా క్రింద ఈ స్టోరి వస్తోంది
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే సభ వాడివేడి చర్చలతో దద్దరిల్లింది. ఇద్దరు ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలి అంటూ సవాల్ చేసుకున్నారు. సభలో ఇద్దరి మధ్య జరిగిన వాదోపవాదాల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఇద్దరి పరిపాలన, అవినీతిపైనా, అభివృద్ధిపైనా, వెన్నుపోటుపైనా, విశ్వసనీయత తదితర అంశాలపై రిఫరెండం పెడదాం.. బాబు ఒప్పుకుంటే తేదీలు ఇస్తాను.. ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి బయటకు పోదామా అని ఛాలెంజ్ చేశారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇద్దరి పరిపాలనపైన రిఫరెండం పెట్టడానికి అభ్యంతరంలేదని అన్నారు. దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. ఛాలెంజ్‌లతే చేసుకున్నారో మరి మాటమీద నిలబెడతారో, లేదో చూడాల్సిందే..
బ్లాగుంది
ReplyDelete