గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనాలో ఉన్న ఒక పెద్ద వాల్(గోడ),దీని పొడవు 6,508 కి.మీ.మైళ్ళలో 4,000 మైళ్ళు. క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో నిర్మింపబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "ఖిన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 200 - 220 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణ కారణం, చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.
చరిత్ర : క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ గోడ నిర్మణం లో సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాష్ట్ర యుద్ధకాలమైన 5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "ఖీ", "యాన్", మరియు "ఝావో" రాష్ట్రాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెదికారు. కోటలకు గోడవలె, రాష్ట్రభూములకూ పటిష్ఠమైన శత్రు దుర్భేద్యమైన గోడలను నిర్మింపతలపెట్టారు. "ఖిన్ షీ హువాంగ్" క్రీ.పూ. 221 లో తన శత్రురాష్ట్రాలను జయించి చైనా ఏకీకరణ చేసి, 'ఖిన్ సామ్రాజ్యాన్ని' స్థాపించాడు. ఈ ఏకీకరణ తరువాత, రాష్ట్రాల మధ్య గల గోడలు, తన సామ్రాజ్యానికి అడ్డుగోడలుగా తయారయ్యాయి, వీటిని తొలగించాలని ఆజ్ఞాపించాడు. తన సామ్రాజ్య ఉత్తరభాగాన, మహాగోడల నిర్మాణానికి ఆజ్ఞలు జారీ చేశాడు. వీటి నిర్మాణానికి కొండప్రాంతాల గోడలకు కొండలనుండే రాళ్ళను తరలించారు.మైదాన ప్రాంతాలలో రాళ్ళనూ మట్టినీ ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలావరకు శిథిలావస్థకు చేరుకొన్నాయి, కాని అందులో కొన్ని నేటికినీ నిలిచి వున్నాయి. తదనంతరం, 'హాన్', 'సాంగ్' మరియు 'జిన్' వంశపు రాజులు, మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు మరియు విశాలీకరణలు చేశారు. ఈ నిర్మాణాలతో ఉత్తరాది ఆక్రమణల నుండి రక్షణకు ఇవి ఉపయోగపడ్డాయి. 1907 లో మహాకుడ్య ఛాయాచిత్రం.'ఖిన్' రాజుల కోటల నిర్మాణాలకంటే 'మింగ్' రాజుల నిర్మాణాలు చాలా బలీయంగా వుండేవి. దీనికి కారణం వీరు 'ఇటుక'లను ఉపయోగించడమే.
మంగోలుల దండయాత్రలు సంవత్సరాల తరబడీ కొనసాగడంవల్ల మింగ్ వంశస్థులు ఈ గోడల నిర్మాణాలను, మరమ్మత్తులను కొనసాగిస్తూనేవచ్చారు. బీజింగ్ నగర సమీపాన ఈ గోడ భాగాలు ఇంకనూ బలిష్ఠంగా నిర్మింపబడ్డవి. క్రీ.శ. 1600 లో, 'షున్' వంశ కాలంలో, మంచూ ల దండయాత్రలనుండి తమ రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ గోడ మహత్తరమైన పాత్రను పోషించాయి. 'యువాన్ చోంగువాన్' సేనాధిపత్యంలో, మంచూలు చైనాలో ప్రవేశించలేకపోయారు. ఆఖరుకు, షున్ వంశపాలనతో విసిగిపోయిన ప్రజలు, 'వూ సాంగుయీ' నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారలను తెరచి మంచూలకు ప్రవేశం కల్పించారు.
మంచూలు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకొని "ఖింగ్" సామ్రాజ్యా"న్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ గోడల మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల బార్బేరియన్ల నుండి చైనాను రక్షించుకొనుటకు చైనాకు దక్షిణాన గోడల నిర్మాణం
No comments:
Post a Comment