Monday, July 27, 2009

దొంగ సన్యాసులు మన వై.యస్===బాబులు



నేను మొన్నె చెప్పాను కదండి అస్సెంబ్లీ సమావేశాలలో వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం తప్ప ప్రజలకి ఉపయోగపడే పని ఒకట్టి చేయరు.సభలో వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదన్న చిన్న విషయం కూడ తెలియకుండా ఒకరు మనకి ముఖ్యమంత్రి ఒకరు ప్రతిపక్షనేత అయ్యారు.ఈ తప్పు మన ప్రజలదో ఇ.వి.యంలదో ఇంకా తెలీదుగాని మొత్తానికి వాళ్ళు సమస్యలు మాట్లాడకుండా పోట్లాడుకున్న మనకే నష్టం ఇదంత తెలియనట్టు ఇంట్లో మనుషుల్ల ప్రశాంతంగా సవాల్లు విసురుకుంటున్నారు.

విరికి ఇంత ఖర్చు పెట్టి ఏ.సిలు, మైక్ లు అవసరమ వీళ్ళు ఇరువురు మాటమీద నిలబడి ఎవరోవకరు తప్పుకుంటే కొత్త వారికి చాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కొత్తగా వచ్చినా జయప్రకాష్ నారయణ్ కి చిరంజీవి కి తెలిసినంత కూడ తెలికుండ తిట్టుకుంటుంటే వీళ్ళు నాయకులేన అనే అనుమానం కలుగుతుంది వీళ్ళ గురుంచి అందరికి తెలుసు అయిన చెపుతున్నానంటే కొత్తవారు తెలుసుకుంటారని

"కుక్క తోక వంకర" అన్నట్టు ఏన్ని పేపర్లు,టి.వి లు వీడియోలతోసహా వారి పోట్లాటలు చూపించినా వారు మాత్రం తిట్టుకోకుండా ఉండలేరు ఇదంత ఎందుకంటే నేను టి.వి.9లో వీళ్ళ చెత్తవాగుడు చూశాను మర్చిపోయాను ఉత్తినే తెలుగు1 ఓపెన్ చేయగానే హెడ్ లైన్ గా క్రింద స్టోరి వస్తోంది

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే సభ వాడివేడి చర్చలతో దద్దరిల్లింది. ఇద్దరు ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలి అంటూ సవాల్‌ చేసుకున్నారు. సభలో ఇద్దరి మధ్య జరిగిన వాదోపవాదాల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఇద్దరి పరిపాలన, అవినీతిపైనా, అభివృద్ధిపైనా, వెన్నుపోటుపైనా, విశ్వసనీయత తదితర అంశాలపై రిఫరెండం పెడదాం.. బాబు ఒప్పుకుంటే తేదీలు ఇస్తాను.. ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి బయటకు పోదామా అని ఛాలెంజ్‌ చేశారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇద్దరి పరిపాలనపైన రిఫరెండం పెట్టడానికి అభ్యంతరంలేదని అన్నారు. దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. ఛాలెంజ్‌లతే చేసుకున్నారో మరి మాటమీద నిలబెడతారో, లేదో చూడాల్సిందే..




అమరావతి స్తూప ప్రత్యేకత


అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్రదుర్గాలలో ఈ నగరమొకటి.

సుమారు 16 కి. మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపద)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది.

మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది అప్పటికే. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి.

ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845లో, రాబర్ట్ సీవెల్ 1877లో, జేమ్స్ బర్గెస్ 1881లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్‌కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్‌లలో భద్రపరిచారు.

ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారిల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు పీరియడ్స్‌కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ రేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.

అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు 'కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము'.దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానదిపై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.



Saturday, July 25, 2009

1954లోనే దాసరి సుబ్రమణ్యం జానపద ఇంద్రజాలం

దాసరి సుబ్రహ్మణ్యం గారు ... మూడుతరాల చందమామ పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట... జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన మేటి రచయిత. ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు "చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు" దాసరి సుబ్రహ్మణ్యం గారు.

"‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున గుర్తుకొచ్చే కథలు ఏవి అంటే.. శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు." వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారే.

"కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన" తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.

జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు. ప్రపంచానికి హ్యారీ ప్యాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, 'తోకచుక్క'తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో 'భల్లూక మాంత్రికుడు' వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి. ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో రెండు,లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు. వరుస క్రమంలో కాకపోయినప్పటికీ, ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామల మధ్య సాంకేతిక సమన్వయం కుదిరిన మేరకు సుబ్రహ్మణ్యంగారి అలనాటి ధారావాహికలను ఒక్కటొకటిగా ఆన్‌లైన్‌లో ప్రచురించబోతున్నారు.చందమామ కధ వీక్షకులకు ఇదో గొప్ప సదవకాశం ఆన్ లైన్ లోను దాసరిసుబ్రమణ్యం కధలు చదువుకోవచ్చు.



Friday, July 24, 2009

అస్సెంబ్లీ లో wwf ప్రసారాలు

click the image


మళ్ళీ రెడి అవండి అద్భుతమైన ఆఫర్ మీరు ఒన్లీ wwf ని టెన్ స్పొర్ట్స్ లో మాత్రమే చూసేవీలుంది ఇప్పుడది 80చానళ్ళకు ప్రత్యక్ష ప్రసారం కూడా అదేంటొ కాదు మన అస్సెంబ్లీ ప్రసారాలు అన్ని చానళ్ళకు ఇచ్చారు ప్రజకోసం ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ కొట్టు కుంటు తిట్టు కుంటు ప్రజ డబ్బు ని హవా చేస్తు ఇక్కడ కూడ నిమిషానికి3లక్షలు ఖర్చు చేస్తు దర్జాగా గడిపేస్తుంటారు కావలంటే చూస్తు ఉండండి ప్రజల గురించి ఏమి మాట్లాడరు వాళ్ళలో వాళ్ళు కొట్టు కుంటు ఉంటారు ఇందుకోసం కొన్ని హద్దులు పెట్టుకున్నారు అవెంటో ఫోటో ని చూడండి


చరిత్రలో ఈ రోజు 7/24/2009

1890: గ్రంథాలయోద్యమ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మించాడు.


1932: రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.


1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.


1971: మహాకవి గుర్రం జాషువా మరణించాడు.


1998: యుద్ధవాహక నౌక కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.


1992: యూనివర్సల్ పోయిట్రీ ఫౌండేషన్ పూనేలో ప్రారంభమయ్యింది






.


Thursday, July 23, 2009

చరిత్రలో ఈ రోజు

బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (జూలై 23 1856 - ఆగష్టు 1 1920)

1856: పండితుడు, గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, భారత జాతీయవాద నేత బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర రత్నగిరిలో జన్మించాడు.


1906: స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ నేత చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్ లోని జాబ్రాలో జన్మించాడు.


1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.


1983: కల్పాక్కం (చెన్నై దగ్గర)అణు విద్యుత్ కేంద్రం లో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.


1904: సుప్రసిద్ధ రచయిత్రి, పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త ఇల్లిందల సరస్వతీదేవి రాష్ట్రంలోని నర్సాపూర్‌లో జన్మించారు.


1918: గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే తన రైళ్లలో ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్ కార్లను ప్రారంభించింది.


1927: బాంబే రేడియో స్టేషన్ ద్వారా భారత్ తన తొలి వాణిజ్య రేడియో ట్రాన్స్‌మిషన్‌ను ప్రారంభించింది.



Wednesday, July 22, 2009

భయం-ఒక కోతుల గుంపు

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడూ, చాలా సుప్రసిద్ధుడూ అయిన స్వామి వివేకానంద (1862-1902) పూర్వాశ్రమ నామం నరేంద్రనాథ్. విలక్షణమైన తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తించేలా భారత ప్రజలను తట్టిలేపే గురుతర బాధ్యతను ఆయన తన లక్ష్యంగా స్వీకరించాడు. చికాగోలో(1893) జరిగిన విశ్వమత సమ్మేళనంలో ఇచ్చిన ఉద్వేగ భరితమైన ఉపన్యాసం ద్వారా పాశ్చాత్య ప్రపంచం భారతదేశ మహొన్నత ఆధ్యాత్మిక జ్ఞనసంపదను గ్రహించేలా చేశాడు.

తన గురువు శ్రీ రామకృష్ణపరమహంస పరమపదించాక, ఆయన సందేశాన్ని దేశ ప్రజల వద్దకుతీసుకువెళ్ళడానికి యువకుడైన స్వామి వివేకానంద దేశం నాలుగు చెరగులా తిరిగి వచ్చాడు. ఆ కాలఘట్టంలో ఒక నాడాయన వారణాసి సమీపంలో నిర్మానుశ్యంగా ఉన్న బాటలో ఒంటరిగా నడిచి వెళుతున్నాడు. అప్పుడు భయంకరమైన కోతల గుంపు ఒకటి ఆయన వెంటబడింది. ఆయన వాటికి దూరంగా పరిగెత్తసాగడు. అయినా కోతులంత వేగంగా ఆయన ఎలా పరిగెత్తగలడు? ఆయనకూ, కోతుల గుంపుకూ ఉన్న మధ్య దూరం తగ్గుతూ రావడంతో ఆయనలో భయం పుట్టింది హఠాత్తుగా, "పరిగెత్తవద్దు. మృగాల్ని ఎదుర్కో," అన్న కంఠస్వరం వినిపించింది. వివేకానంద పరిగెత్తడం ఆపి, అక్కడే నిలబడి, కోతుల కేసి కోపంగా తిరిగి చూశాడు. బెదిరిపోయిన కోతులు ఠక్కున ఆగిపోయాయి. చూస్తూండగానే అవి మెల్లగా వెనుక్కు తగ్గి, వచ్చిన దారినే వెళ్ళి పోయాయి. దారిపక్కన కూర్చుని సమయానికి తనకు చక్కని సలహా ఇచ్చిన సాధువుకు కృతజ్ఞతలు తెలియ జేశాడు వివేకానంద.



Sunday, July 19, 2009

బాలివుడ్ సంగీతంలో వజ్రం: యే జిందగీ ఉసీకి హై

కొన్ని పాటలు కొందరు పాడితేనే రస స్ఫోరకంగా ఉంటాయి. ఆ పాటకోసమే ఆ గాయనీ గాయకులు పుట్టారా లేదా వారికోసమే ఆ పాట పుట్టిందా అనేంతగా పాటా గాయకులు మమేకం అయిపోయిన సందర్భాలు సినీ సంగీతంలో కో కొల్లలు. హిందీ చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో వచ్చిన అలాంటి అపరూపమైన పాటల్లో యే జిందగీ ఉసీకి హై పాట ఒకటి. యే జిందగీ ఉసీకి హై ప్రియుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదని ఒక ప్రియురాలు ఏకాంతంలో రాసిచ్చిన అపురూప దఖలు పత్రం ఈ పాట. జీవితం ఇలా సాగాలని, ఇలా బతకాలని మధురోహలు పెట్టుకుని, కలలు కని, అవి భగ్నమైన వారి జీవితాలను ఈ పాట ఎంత శోకమయంగా పలకరిస్తుందో... ఈ పాట నాటి సంగీత దర్శకుడు సి రామచంద్ర స్వరకల్పనలో ఏ మంగళప్రద ఘడియలో లతా మంగేష్కర్ గాంధర్వ గాత్రంనుంచి వెలువడిందో కానీ గత ఆరు దశాబ్దాలుగా హిందీ పాటల శ్రోతల హృదయాలను అది మలయ సమీరంగా వెంటాడుతూనే ఉంది. జీవితమే సఫలమూ రాగసుధా భరితమూ అనే తెలుగు అనార్కలి సినిమాలోని పాటకు ఇది హిందీ మాతృక. ఆ నాటి హిందీ సినిమా సంగీత దర్శకులలో ఉన్నత శిఖరాలమీద నిలిచి ఉన్న సి రామచంద్ర ఈ పాటను లత చేత పాడించాలని తలచిన క్షణం సినిమా సంగీతలోకంలో ఒక గాన రేరాణికి పట్టం కట్టింది. గాయనీ గాయకుల్లోని శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో అఖండుడైన సి రామచంద్ర ఈ పాటకు లతను ఎన్నుకున్న నేపథ్యం విలక్షణమైంది. యాభయ్యవ దశకంలో హిందీ చలన చిత్రరంగంలో దేదీప్యమానంగా వెలిగిన మెలోడీ సంగీత సౌధానికి పునాది రాళ్లుగా నిలిచిన నలుగురు సంగీత దర్శకుల్లో సి రామచంద్ర అగ్రగణ్యుడు. మిగతా ముగ్గురు అనిల్ బిశ్వాస్, మదన్ మోహన్, రోషన్. దేశ విదేశాలకు సంబంధించిన ఏ సంగీత రూపాన్నయినా సినిమా సంగీతంలోని ఒడుపుగా తర్జుమా చేసుకుని దానికి భారతీయ ముద్రను ఒద్దిగా అద్దే రూపశిల్పి రామచంద్ర. పాటకు మంచి బాణీ కట్టడమే కాదు... గాయనీ గాయకుల ప్రతిభా పాటవాలను అంచనా వేసి, వారి స్వరపేటికలోని మంచిచెడ్డలను ఇట్టే పట్టేయడంలో రామచంద్ర అఖండుడు. సినిమాలకు వచ్చిన తొలిరోజుల్లో ఆనాటి అమర గాయక నటి నూర్జహాన్ ప్రభావానికి అమితంగా గురైన లతను దారి మళ్లించి లతగానే నిలబెట్టిన ఘనుడు రామచంద్ర. ఈ క్రమంలో లత గాన భవిష్యత్తుకు రామచంద్ర తన నిరాలా -1950-, సర్‌గమ్ -1950-, పర్‌చాయి -1952-, షిన్ షినాకి బూబ్లబూ - 1952- సినిమాలు లతా, రామచంద్ర జంటను పాపులర్ చేస్తే, 1953లో వచ్చిన అనార్కలి చిత్రం ఈ జంటను శిఖరాగ్రానికి చేర్చింది. అలనాటి హిందీ చిత్రం అనార్కలిలో లతా గొంతులోంచి జాలువారిన రామచంద్ర పాటలు విన్న శ్రోతలు సీ రామచంద్ర మహాప్రభో అని ఆనంద భాష్పాలు విడిచేవారట. అయితే ఒక గాయని సినీ గాన భవిష్యత్తును ప్రభావితం చేసిన అనార్కలి సినిమాలో పాటలకు లతాను ఎన్నుకోవడంలోనే రామచంద్ర గొప్పతనం దాగి ఉందంటారు విమర్శకులు. అది బొంబాయి సినిమా పరిశ్రమ గీతాదత్ గోము పాటలనే తలచుకుని గుటకలు వేస్తున్న కాలం. అనార్కలి సినిమాలో కూడా ఆమె చేతనే పాటలు పాడిద్దామని అంతా అనుకుంటే రామచంద్ర మాత్రం లతా అని అన్నాడట. ఎంత ఖచ్చితంగా అంటే ఇంకెవ్వరూ నోరెత్తలేనంతగా చెప్పాడు. ఇంకేముంది. దాని తర్వాత అంతా చరిత్రే మరి.


1793 నాటి ధనం












పింగళి వెంకయ్య జీవిత చరిత్ర

పింగళి వెంకయ్య ఇతని కధని చదవటం అనేది చాల గొప్ప విషయం ఇతని గురించి తెలుసుకుంటే మన జాతీయపతాకానికి 100 సార్లు సాష్ఠంగ నమస్కారం చేసినట్టే ఇదంత ఎందుకు చెపుతున్ననటే మీరు ఈ ఈయన కధ చదువుతారని రాశను.

పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1878 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య.


వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి.

ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లి లో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.

19 ఏళ్ల వయసులో దేశభక్తి మరియు ఉత్సాహముతో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధములో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యము అర్ధశతాబ్దము పాటు నిలిచింది.


ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని దీన్ని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపాడు. 1916 లో భారతదేశానికొక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు.

ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక వెలయించాడు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవాడు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది


Friday, July 17, 2009

ఎంత దరిద్రపు సినిమాలు "అ సినిమా స్టొరీ లైన్ చూడాలంటే?"

నిన్నమొన్నటి దాక కొంచం అయిన మంచి సన్నివేశాలు,కధ కధనాలతో సినిమాలు వచ్చేవి ఇప్పుడు డైరక్టర్లు,నిర్మాతలు అదేమి ఆలోచించకుండా ఎటువంటి సినిమాలు పడితే అటువంటి సినిమాలు తీసేస్తున్నారు మొన్న ఈ మధ్య చిన్న పిల్లడితో ప్రేమ సన్నివేశాలు ఉన్న చిత్రం ఏదో అ సినిమా స్టొరీ లైన్ [ఆ కుర్రాడు వయస్సు పదమూడు. ఆమె వయస్సు ముప్పై. ఆమెతో అతను శృంగారం పొందాలని ప్రయత్నం చేస్తాడు.]ఆ సినిమాలోని కొన్ని ఫోటోలు హిరోయిన్ వి
Kiran RathodKiran Rathod
ఇటువంటి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు కూడ ఆడిస్తే జనానికి మెదడు లేనట్టే అలాంటిదే మరొకటి అది మరెవరో కాదు ఒక్కమగాడు పాటతో అలరించిన మన సిమ్రాన్ గారు
ఈ సినిమా పేరు "కిచా వయస్సు 16’ చిత్రం". దానిని తెలుగులోకి అనువాదం చేసి "‘నా వయసు 16’" పేరిట తెలుగులో రిలీజ్ చేస్తున్నారు
తమిళంలో ఇది పెద్ద హిట్ అంట ఇలాంటి సినిమాలని ఎలా హిట్ చేశారోమరి ఇదంత పక్కన పెడితే ఈ సినిమా డైరక్టర్ దీని గురించి గొప్పగా టీచర్‌గా సిమ్రాన్‌ నటించారు. అనిత మరో పాత్ర పోషించింది.యువతను కవ్వించే రొమాంటిక్‌ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది.అంటు చెప్పడం మరి దరిద్రం గొప్ప యాక్టర్ లు నటించిన మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి చిత్రాలు రావడం భాధకరం.


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు నిర్మించారో వివరణ


గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చైనాలో ఉన్న ఒక పెద్ద వాల్(గోడ),దీని పొడవు 6,508 కి.మీ.మైళ్ళలో 4,000 మైళ్ళు. క్రీ.పూ. 5, 6 శతాబ్దాల కాలంలో నిర్మింపబడి, క్రీ.శ. 16 శతాబ్దం వరకూ పునర్నిర్మాణాలకు లోనై, నేటికీ నిలిచి ఉంది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి "ఖిన్ షీ హువాంగ్" చే క్రీ.పూ. 200 - 220 కాలంలో నిర్మింపబడింది. దీని నిర్మాణ కారణం, చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ 'మింగ్ వంశ' కాలంలో నిర్మింపబడింది.


చరిత్ర : క్రీ.పూ. 7వ శతాబ్దకాలంలో చైనీయులకు ఈ గోడ నిర్మణం లో సాంకేతికాలన్నీ తెలుసు. చైనాలో అంతర్-రాష్ట్ర యుద్ధకాలమైన 5వ శతాబ్దం నుండి క్రీ.పూ. 221 వరకు, "ఖీ", "యాన్", మరియు "ఝావో" రాష్ట్రాలమధ్య, వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెదికారు. కోటలకు గోడవలె, రాష్ట్రభూములకూ పటిష్ఠమైన శత్రు దుర్భేద్యమైన గోడలను నిర్మింపతలపెట్టారు. "ఖిన్ షీ హువాంగ్" క్రీ.పూ. 221 లో తన శత్రురాష్ట్రాలను జయించి చైనా ఏకీకరణ చేసి, 'ఖిన్ సామ్రాజ్యాన్ని' స్థాపించాడు. ఈ ఏకీకరణ తరువాత, రాష్ట్రాల మధ్య గల గోడలు, తన సామ్రాజ్యానికి అడ్డుగోడలుగా తయారయ్యాయి, వీటిని తొలగించాలని ఆజ్ఞాపించాడు. తన సామ్రాజ్య ఉత్తరభాగాన, మహాగోడల నిర్మాణానికి ఆజ్ఞలు జారీ చేశాడు. వీటి నిర్మాణానికి కొండప్రాంతాల గోడలకు కొండలనుండే రాళ్ళను తరలించారు.మైదాన ప్రాంతాలలో రాళ్ళనూ మట్టినీ ఉపయోగించారు. ఈ ప్రాచీన గోడలు చాలావరకు శిథిలావస్థకు చేరుకొన్నాయి, కాని అందులో కొన్ని నేటికినీ నిలిచి వున్నాయి. తదనంతరం, 'హాన్', 'సాంగ్' మరియు 'జిన్' వంశపు రాజులు, మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు మరియు విశాలీకరణలు చేశారు. ఈ నిర్మాణాలతో ఉత్తరాది ఆక్రమణల నుండి రక్షణకు ఇవి ఉపయోగపడ్డాయి. 1907 లో మహాకుడ్య ఛాయాచిత్రం.'ఖిన్' రాజుల కోటల నిర్మాణాలకంటే 'మింగ్' రాజుల నిర్మాణాలు చాలా బలీయంగా వుండేవి. దీనికి కారణం వీరు 'ఇటుక'లను ఉపయోగించడమే.

మంగోలుల దండయాత్రలు సంవత్సరాల తరబడీ కొనసాగడంవల్ల మింగ్ వంశస్థులు ఈ గోడల నిర్మాణాలను, మరమ్మత్తులను కొనసాగిస్తూనేవచ్చారు. బీజింగ్ నగర సమీపాన ఈ గోడ భాగాలు ఇంకనూ బలిష్ఠంగా నిర్మింపబడ్డవి. క్రీ.శ. 1600 లో, 'షున్' వంశ కాలంలో, మంచూ ల దండయాత్రలనుండి తమ రాజ్యాలను కాపాడుకోవడంలో ఈ గోడ మహత్తరమైన పాత్రను పోషించాయి. 'యువాన్ చోంగువాన్' సేనాధిపత్యంలో, మంచూలు చైనాలో ప్రవేశించలేకపోయారు. ఆఖరుకు, షున్ వంశపాలనతో విసిగిపోయిన ప్రజలు, 'వూ సాంగుయీ' నాయకత్వంలో షన్ హైగువాన్ వద్ద ద్వారలను తెరచి మంచూలకు ప్రవేశం కల్పించారు.

మంచూలు బీజింగ్ నగరాన్ని స్వాధీనపరచుకొని "ఖింగ్" సామ్రాజ్యా"న్ని స్థాపించారు. వీరి కాలంలో ఈ గోడల మరమ్మత్తులు, పునర్నిర్మాణాలు ఆగిపోయాయి. చైనా దక్షిణాన గల బార్బేరియన్ల నుండి చైనాను రక్షించుకొనుటకు చైనాకు దక్షిణాన గోడల నిర్మాణం