Saturday, July 11, 2009

కాంగ్రెస్ పై చిరు తనదైన శైలిలో ద్వజమెత్తరు

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలిటిక్స్‌ను పాలిట్రిక్స్‌గా మార్చాడని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఎన్నికల ముందు సాధారణంగా ఉండే రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే దిశలో ఉన్నాయన్నారు. రాజకీయ అస్తవ్యస్థతకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలే కానీ, రాష్ట్రంలో ఇతర పార్టీలనేవి లేకుండా చేయాలని ఆ పార్టీలు అడ్డుకాకుండా చూడాలి, ప్రతిపక్ష పార్టీలు ఉంటే మళ్ళీ అధికారంలోకి రాలేమేమో? అనే భయంతో ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలనే విధానం సరికాదన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అదే ఆపరేషన్ పేరుతో ఏమీ లేకుండా చేస్తారనే విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి మునుపెన్నడూ లేదని, ఎవరొస్తే వాళ్ళు రానివ్వండి పార్టీలో చేర్చుకుందాం అనే విధానం కొత్తగా చోద్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారంలోకి తెచ్చింది ప్రజాసమస్యలు లేకుండా చూడాలని కానీ, ఆ పార్టీ బలంగా తయారు కావాలి భవిష్యత్‌లో కూడా కలకాలం అధికారంలో ఉండాలని కాదని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు భయాందోళనకు గురవుతున్నా రన్నారు. కందిపప్పు, బియ్యం, చక్కెర వంటి నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి, కూరగాయలు వండాలంటే ప్రస్తుతం ఒక విలాశవంతమైన జీవితంలా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలను పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫలమైందని దీనికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ దాడులు నిర్వహించి వేల, లక్షల టన్నుల నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వచేసే వారిని పట్టుకుంటుందని, ఈ పట్టుకున్న నిల్వలను వారిపై ఫెనాల్టిద్ వేసి వారికే అప్పగించడం వల్ల ఆ భారమంతా ప్రజల మీదే పడుతుందన్నారు. స్వాధీనం చేసుకున్న నిత్యావసర వస్తువులను బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వమే విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి విహార యాత్రలను వెళ్ళడం, విలువైన సమయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మీ మానాన మీరు పొండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని ఆయన మండి పడ్డారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం వారికి సరిపోను విత్తనాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 17 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా 14 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం చెబుతూ ఉందని, మిగిలిన విత్తనాలు ఎవరివ్వాలని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షిస్తే ప్రయోజనం ఏమిటన్నారు. దేశంలో ఆహార ఉత్పత్తుల పెరుగుదల రేటు నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్రంలో 1.8 శాతం మాత్రమే ఆహార ఉత్పత్తుల పెరుగుదల కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు లేవని చెప్పడానికి వీలు లేదని, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్భాటంగా చేపట్టిన జలయజ్ఞానికి కేంద్రం నుండి నిధులు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం మొండి చేయి చూపిందని, ఈ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాను ఉపయోగించుకొని తమ పార్టీ నుండి కొందరు నాయకులు బయటకు వెళుతున్నారంటూ లీకులు చేసి ప్రచారం చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. తమ పార్టీని అస్తవ్యస్థం చేసేందుకే ఇటువంటి ఛీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము పార్టీ నుంచి వెళ్ళిపోవడం లేదని తమ పార్టీ నాయకులు పత్రికా ప్రకటనలు పంపినా, విలేఖరులకు నేరుగా చెప్పినా కూడా అంత ప్రచారం ఇవ్వడం లేదని కానీ, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే మాత్రం ప్రచారం చేస్తున్నారని ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చంద్రబాబే ఆధ్యుడని చిరంజీవి ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, రాజకీయ పరిణితిని రాజకీయ లబ్ధికే వాడుకుంటున్నాడని ఆయన అన్నారు. పార్టీ ప్రతిష్ఠతపై ఆయన దృష్టిసారించాలే కానీ, ప్రతిపక్ష పార్టీల నుండి నాయకులను ఆకర్షించడం విజ్ఞత కాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఐక్యం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎన్నికల ముందు మహాకూటమిని ఏర్పాటు చేసినట్లుగా ఇప్పుడు కూడా ప్రతిపక్షాలన్నింటినీ లుపుకుపోయి ప్రభుత్వంపై ఉద్యమించాలని, అది నిజమైన ప్రతిపక్ష నాయకుడి లక్ష్యమని కానీ, కాంగ్రెస్ ట్రాప్‌లో పడి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. అప్పుడు అధికారం కోసం చంద్రబాబు ఈ ప్రయత్నం చేశాడని కానీ, ఇప్పుడు ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు రాజకీయ పరిణితిపై, ఆయన మానసిక పరిస్థితిపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన రీతిలో ఆయన ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానిస్తూ పరోక్షంగా చంద్రబాబుకు మతి భ్రమించిందనే రీతిలో చిరంజీవి మాట్లాడారు. తమ రాజకీయ సుస్థిరతల కోసం ప్రయత్నించడంలో చంద్రబాబుకు, వైఎస్‌కు తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని ఆయన మండిపడ్డారు........

No comments:

Post a Comment