Sunday, July 12, 2009

వదల "రామోజీ" నిన్ను వదల








రామోజీరావు పై ఎప్పటినుంచో సీరియల్ చేస్తానంటూ చెప్పుకొస్తున్న ఉండవల్లి త్వరలోనే ఆ ఆలోచనలకు ప్రాణం పోసేటట్లు కనపడుతున్నారు. టీవీ కోసం తానొక సీరియల్ నిర్మ్ణానికి సిద్దమయ్యాడు. రామోజీ జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సీరియల్ ఉండబోతోందా అని అనుకుంటే, రామోజీతో రాజీలేని పోరాటంతోనే తన పేరు బాగా ప్రచారం లోకి వచ్చిందనీ, దీంతో తాను తీసే సీరియల్ రామోజీపైనే ఉండబోతోందని అనుకుంటే ఎలా అని అని నర్మగర్భంగా అనుకుంటునాడు ఉంటుందనే తెలుస్తోంది.సమకాలీన రాజకీయ అంశాలతో ఈ సీరియల్ ఉంటుందనీ, ఇందులో చాలా పాత్రలే ఉంటాయనీ అనుకుంటే అచ్చంగా రమోజీ పై తీసినదే.
అలాగే ఇప్పటికే ఆ సీరియల్ కోసం ఇరవై ఎపిసోడ్లు వరకూ రెడీ అయ్యాయి.ఉండవల్లి దగ్గర ఒక సినిమా తీసేందుకు అవసరమైన మంచి స్క్రిప్టు కూడా ఉందంట, ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే సినిమా తీయాలనుకుంటున్నాననీ మరో బాంబు విసిరాడు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఇష్టమనీ, అసలు జనాలకు బాగా చేరువ కావాలంటే సినిమాకు మించిన మాధ్యమం లేదనీ చెప్పుకొస్తునాడు. ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర రామోజీ శైలికి అనుకరణ. ఆ పాత్రకి రాఘవేంద్రరావు అనే పేరు పెట్టారు. అయితే అప్పట్లో ఆ సీరియల్‌ను ప్రసారం చేయడానికి ప్రధాన టీవీ చానళ్లేవీ ముందుకు రాలేదు. రామోజీతో గొడవకి అవేవీ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో కొంత కాలం నుంచీ ఆ సీరియల్ డబ్బాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఉండవల్లి ముఖంలో ఆనందం తొంగి చూస్తోంది.కారణం సమీప భవిష్యత్తులో ఆ సీరియల్ వెలుగు చూసే అవకాశం ఉండటమే. వైఎస్ జగన్ ప్రారంభించిన సాక్షి చానల్‌లో అది ప్రసారమయ్యే అవకాశాలున్నట్లు ఆ మధ్య చెప్పుకొన్నారు. అయితే ఈరోజు టీవీ ఛానెల్స్ పెరగటంతో ఏదో ఒక కాంగ్రేస్ హవా ఉండటంతో ఏదో ఒక చానల్లో (కాంగ్రెస్ సపోర్టు ఛానెల్) లో వేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే మరోసారి రామోజీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు

.


No comments:

Post a Comment