Friday, July 10, 2009

కాఫీ టీ ధూమపానం :స్వర్గం ముంగిట్లో మీరు




సిగరెట్టు తాగనివాడు వచ్చే జన్మలో దున్నపోతై పుట్టును అనే మాటను గురజాడ ఏ సందర్భంగా రాశారో తెలియదు. కాని మనవాళ్ళు పొగ తెగ తాగేస్తున్నారు. దున్నపోతులై పుట్టుకుండా ఉండడానికే ఇలా చేస్తున్నారేమోనని అనుమాం. సరే వారి ఉద్దేశ్యం ఏదైనా... పొగతాగడం హానికరమని డాక్టర్లు వాపోతున్నారు. ధూమపానం వలన గుండెపోటు వస్తుందని పదే పదే చెప్పుతున్నారు. ఇది ఇప్పటి మాట కాదు. దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఆ విషయం మనోళ్ళ చెవికెక్కలేదు. వీరితో మాన్పించడం మనకయ్యే పని కాదనుకున్నారేమో... లండన్‌కు చెందిన వైద్య పరిశోధకులు వీరిలో గుండే జబ్బుల సంభావ్యతను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేశారు. చివరకు రెండు కప్పుల టీ, కాఫీలతో పరిష్కారం కనుగొన్నారు. రోజుకు రెండు కప్పుల కాఫీగానీ, టీతో ఈ సంభావ్యతను తగ్గించవచ్చునని తేల్చేశారు. దాదాపుగా 26 వేల మంది ధూమపానరాయుళ్ళపై పరిశోధన చేశారు. వీరిలో టీ, కాఫీలు తాగేవారిలో దాదాపు 21 శాతం వరకూ టైప్-2 గుండె పోటు తగ్గే అవకాశం వరకూ ఉందని వారు తేల్చారు. ఇందులో దాదాపు 13 యేళ్ళకుపైగా మద్యం ప్రియుళ్లు, ధూమపానరాయుళ్ళకు వివిధ రకాల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. ఇది వారి వయసు, ప్రమేయాలపై ఆధారపడి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే అయితే కాఫీ, లేదా టీ సేవించడం ద్వారా ఈ సంభావ్యతను తగ్గే అవకాశం ఉందని వారు తేల్చారు. ఇది మస్తిష్కానికి రక్తం సరఫరా చేసే నరాలాను బ్లాక్ చేస్తాయి. ధూమపానం చేయని వారిపై టీ, కాఫీలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశాన్ని వారు పరిశీలించ లేదు. టీలో యాంటీ ఆక్సీడెంట్లు రక్తంలోని కొలస్ట్రాల్‌పై పని చేస్తుంది. దానిని తగ్గిస్తుంది ఫలితంగా గుండెజబ్బులు తగ్గే అవకాశం ఉంది. అలాగే పెరిగే శరీరానికి, టీ సేవించడానికి సంబంధం ఉందని వారు పుతున్నారు. టీ సేవించడం వలన సెలబ్రాల్ ఇన్ఫ్రాక్షన్ తగ్గుతుందని వారు తేల్చారు. ఇంకేముంది... ఇంకో రెండు సిగరెట్లు ఊదేసి రెండు కప్పుల టీ తాగేస్తే పోతుందిగా అనుకుంటున్నారు. టీ, కాఫీ సేవించడం వలన ప్రమాద సంభావ్యత తగ్గుతుందే కానీ, పూర్త స్థాయిలో నివారించలేవన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మంచిది.
Custom Search


No comments:

Post a Comment