Monday, July 27, 2009
దొంగ సన్యాసులు మన వై.యస్===బాబులు
అమరావతి స్తూప ప్రత్యేకత
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్రదుర్గాలలో ఈ నగరమొకటి.
Saturday, July 25, 2009
1954లోనే దాసరి సుబ్రమణ్యం జానపద ఇంద్రజాలం
Friday, July 24, 2009
అస్సెంబ్లీ లో wwf ప్రసారాలు
చరిత్రలో ఈ రోజు 7/24/2009
1890: గ్రంథాలయోద్యమ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మించాడు.
Thursday, July 23, 2009
చరిత్రలో ఈ రోజు
బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (జూలై 23 1856 - ఆగష్టు 1 1920)
1856: పండితుడు, గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, భారత జాతీయవాద నేత బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర రత్నగిరిలో జన్మించాడు.
1906: స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ నేత చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్ లోని జాబ్రాలో జన్మించాడు.
1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
1904: సుప్రసిద్ధ రచయిత్రి, పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త ఇల్లిందల సరస్వతీదేవి రాష్ట్రంలోని నర్సాపూర్‌లో జన్మించారు.
Wednesday, July 22, 2009
భయం-ఒక కోతుల గుంపు
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడూ, చాలా సుప్రసిద్ధుడూ అయిన స్వామి వివేకానంద (1862-1902) పూర్వాశ్రమ నామం నరేంద్రనాథ్. విలక్షణమైన తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తించేలా భారత ప్రజలను తట్టిలేపే గురుతర బాధ్యతను ఆయన తన లక్ష్యంగా స్వీకరించాడు. చికాగోలో(1893) జరిగిన విశ్వమత సమ్మేళనంలో ఇచ్చిన ఉద్వేగ భరితమైన ఉపన్యాసం ద్వారా పాశ్చాత్య ప్రపంచం భారతదేశ మహొన్నత ఆధ్యాత్మిక జ్ఞనసంపదను గ్రహించేలా చేశాడు.
తన గురువు శ్రీ రామకృష్ణపరమహంస పరమపదించాక, ఆయన సందేశాన్ని దేశ ప్రజల వద్దకుతీసుకువెళ్ళడానికి యువకుడైన స్వామి వివేకానంద దేశం నాలుగు చెరగులా తిరిగి వచ్చాడు. ఆ కాలఘట్టంలో ఒక నాడాయన వారణాసి సమీపంలో నిర్మానుశ్యంగా ఉన్న బాటలో ఒంటరిగా నడిచి వెళుతున్నాడు. అప్పుడు భయంకరమైన కోతల గుంపు ఒకటి ఆయన వెంటబడింది. ఆయన వాటికి దూరంగా పరిగెత్తసాగడు. అయినా కోతులంత వేగంగా ఆయన ఎలా పరిగెత్తగలడు? ఆయనకూ, కోతుల గుంపుకూ ఉన్న మధ్య దూరం తగ్గుతూ రావడంతో ఆయనలో భయం పుట్టింది హఠాత్తుగా, "పరిగెత్తవద్దు. మృగాల్ని ఎదుర్కో," అన్న కంఠస్వరం వినిపించింది. వివేకానంద పరిగెత్తడం ఆపి, అక్కడే నిలబడి, కోతుల కేసి కోపంగా తిరిగి చూశాడు. బెదిరిపోయిన కోతులు ఠక్కున ఆగిపోయాయి. చూస్తూండగానే అవి మెల్లగా వెనుక్కు తగ్గి, వచ్చిన దారినే వెళ్ళి పోయాయి. దారిపక్కన కూర్చుని సమయానికి తనకు చక్కని సలహా ఇచ్చిన సాధువుకు కృతజ్ఞతలు తెలియ జేశాడు వివేకానంద.
Sunday, July 19, 2009
బాలివుడ్ సంగీతంలో వజ్రం: యే జిందగీ ఉసీకి హై
పింగళి వెంకయ్య జీవిత చరిత్ర
పింగళి వెంకయ్య ఇతని కధని చదవటం అనేది చాల గొప్ప విషయం ఇతని గురించి తెలుసుకుంటే మన జాతీయపతాకానికి 100 సార్లు సాష్ఠంగ నమస్కారం చేసినట్టే ఇదంత ఎందుకు చెపుతున్ననటే మీరు ఈ ఈయన కధ చదువుతారని రాశను.
పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1878 - జూలై 4, 1963), స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య.
వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా మచిలీపట్నము సమీపమున ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి.
ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లి లో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు.
19 ఏళ్ల వయసులో దేశభక్తి మరియు ఉత్సాహముతో దక్షిణాఫ్రికా లో జరుగుతున్న బోయర్ యుద్ధములో పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యము అర్ధశతాబ్దము పాటు నిలిచింది.
ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే తన అభిమాన విషయంగా పెట్టుకొని దీన్ని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించాడు. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపాడు. 1916 లో భారతదేశానికొక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు.
ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక వెలయించాడు. అప్పట్లో వెంకయ్య బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉండేవాడు. ఆనాడు అతను చిత్రించిన పతాకమే నేటి త్రివర్ణ జాతీయ జెండాగా రూపొందింది