వైఎస్ అనుకూల వర్గం- వ్యతిరేక వర్గం క్రమంగా బయటపడుతున్నాయి. జగన్‌కు అనుకూలంగా గొంతు చించుకుని అరిచేవారు ఒకవైపు కనిపిస్తుంటే... వ్యతిరేకంగా గొంతు పెంచి మాట్లాడేవారు మరోవైపు కనబడుతున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ రెండు ముక్కలయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది.
వైఎస్ మరణానంతరం రోశయ్యకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన దగ్గర్నుంచి... కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నిరసనను వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే వాటన్నిటినీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు.
ఇదిలావుంటే సినీ నటుడు రాజశేఖర్ జగన్‌ను సీఎం చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. జగన్‌కు ఎందుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చాడు.
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించే సత్తా... ఒక్క జగన్‌కు మాత్రమే ఉన్నదని రాజశేఖర్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. కాంగ్రెస్ అధిష్ఠానానికి కొంతమంది చాడీలు చెప్పి జగన్‌కు సీఎం పదవి రాకుండా చేస్తున్నారని రాజశేఖర్ సతీమణి జీవిత అన్నారు.

No comments:
Post a Comment