దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది.
వైఎస్సార్ అభయహస్తం పథకంలో భాగంగా నవంబర్ ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు నాలుగు లక్షల మంది మహిళలకు పెన్షన్ బాండ్ల పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇంకా చేనేత రుణాల మాఫీపై విధివిధానాలను గురువారం మంత్రి మండలి చర్చించింది.
అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్వైన్‌ఫ్లూ పై విస్తృతంగా ప్రచారం చేయాలని, నిబంధనలకు లోబడే వైఎస్ విగ్రహాల ప్రతిష్టాపన చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. సీనియర్ ఆర్డీవోలను అదనపు జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేనేత రుణాల మాఫీ, కరువు, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర అంశాలపై చర్చ జరిగింది.

No comments:
Post a Comment