Sunday, September 13, 2009

14,677సీట్లు మిగిలాయ్

ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్‌ పూర్తయినా సీట్లు భారీగా మిగిలాయి. దాదాపు 14,677సీట్లు మిగలడం గమనార్హంకదూ!. ఎంసిఎలో 14,474, ఎంబిఎలో 203సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఐసెట్‌ రెండోదశ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థుల సీట్లను కేటాయిస్తు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కెసిరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా వారికి కేటాయించిన కాలేజీల్లో ప్రవేశం పొందాలని కోరారు. ప్రవేశం పొందని విద్యార్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌లు పొందడానికి కూడా ఫీజును ఇవ్వకూడదని, ఒకవేళ ఆయా కాలేజీలు అడిగితే సహాయ కేంద్రాలను సంప్రదించాలని కోరారు. మొదటి దశ కౌన్సిలింగ్‌లో 75,549 మంది పాల్గొని 73,51,827 ఆప్షన్లను ఇవ్వగా, రెండో దశ కౌన్సిలింగ్‌లో 42,430 మంది విద్యార్థులు పాల్గొని 55,41,065 ఆప్షన్లను ఇచ్చారని అన్నారు. రెండో దశ కౌన్సిలింగ్‌లో ఎంసిఎలో 287 మందికి మాత్రమే సీట్లను కేటాయించగా, ఎంబిఎలో 7,783 మందికి సీట్లను కేటాయించామన్నారు. మొదటి విడతలో 46,150సీట్లు, రెండో విడతలో 8070 సీట్లను కేటాయించామని వివరించారు. అయినప్పటికీ ఇంకా 14,677సీట్లు మిగిలే ఉన్నాయని అన్నారు.చాల మంచి పని చేశారు ముందుగ చెప్పినట్టుగా కాకుండా సర్టిఫికెట్లు తీసుకోవడానికి 3000కట్టమని అడిగిన వారు ఆన్ లైన్ కౌన్స్లింగ్ తో చతికిలపడిన వీరు కాస్తైన విమర్శలు తగ్గుతాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు మొన్న జరిగిన డిగ్రీ పరిక్షలలో చాల మంది తప్పినట్టు తప్పుడు గా ప్రకటించటంతో ఇన్ని సీట్లు మిగిలాయ్ అనుకుంటున్నాను మరి అన్ని కాకపోయిన కొన్ని అయిన భర్తి అయి ఉండేవి వారి తప్పిదమే వారిని ముంచేసింది


No comments:

Post a Comment