Friday, September 25, 2009

ఎయిడ్స్ మహమ్మారికి విరుగుడు



ప్రపంచ వైద్య పరిశోధనల చరిత్రలో మరో కీలక అధ్యాయానికి తెరలేచింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారికి విరుగుడును కనిపెట్టడం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలకు సవాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దీనికి పూర్తి విరుగుడు కనిపెట్టడం సాధ్యపడనప్పటికీ, దాని ముప్పును తగ్గించే వ్యాక్సిన్‌ను మాత్రం శాస్త్రవేత్తలు తయారు చేశారు.

థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ ఎయిడ్స్ ముప్పును 31 శాతం వరకు తగ్గిస్తుంది. ఎయిడ్స్ వైరస్ త్వరగా వ్యాపించకుండా అడ్డుకునే ఈ వ్యాక్సిన్‌ను థాయ్‌లాండ్‌‍లో 16 వేల మందిపై పరీక్షించి శాస్త్రవేత్తలు ఫలితాలను ప్రకటించారు. ఇటీవల సంవత్సరాల్లో ఎయిడ్స్ వైరస్‌పై జరిగిన పరిశోధనలన్నీ విఫలమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఎయిడ్స్‌ను అడ్డుకునే వ్యాక్సిన్‌ను కనిపెట్టడం సాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య సమాజం భావిస్తూ వచ్చింది.

అయితే బ్యాంకాక్ పరిశోధకులు మాత్రం ఎయిడ్స్ వైరస్‌ను సవాలుగా తీసుకొని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో 16 వేల మంది వాలంటీర్లను భాగస్వాములను చేశారు. హెచ్ఐవీ సోకకుండా 31 శాతం వరకు అడ్డుకునే వాక్సిన్‌ను వారు ఈ పరిశోధనల్లో తయారు చేశారు. ఎయిడ్స్ వైరస్‌ను అడ్డుకునే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను కనిపెట్టడం ఇదే తొలిసారి.

1 comment:

  1. ఇంకా పూర్తి స్థాయి వ్యాక్సిన్ త్వరలోనే శాస్త్రజ్ఞులు కనిపెడతారని ఆశిస్తాను.

    ReplyDelete