Sunday, September 27, 2009

విజయదశమి మంచి రోజా?ఆంధ్రకి

రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణజేటి రోశయ్య సీ బ్లాక్‌ నుంచి తన విధులు నిర్వహించడానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సోమవారంనాడు విజయదశమి కావడంతో ఉదయం తొమ్మిది గంటలకు సీ బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి లభించడంతో జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం విజయదశమి రోజున పూజ అనంతరం రోశయ్య సీ బ్లాక్‌లోకి మారతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో వైపు మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ అక్టోబర్ నెలలో ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హటాన్మరణానంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన రోశయ్య డి బ్లాక్‌లోని తన పాత ఛాంబర్‌ నుంచే బాద్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్‌‌ను ముఖ్యమంత్రి కావాలని బలమైన వాదనలు, విన్నపాలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఆదేశిస్తేనే తప్ప సీ బ్లాక్‌లోకి వెళ్లనని రోశయ్య పదే పదే చెబుతూ వచ్చారు.

తాజాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సీ బ్లాక్‌లోకి వెళ్లాలని సూచించడంతో రేపు ఆయన డీ బ్లాక్‌ నుంచి మారనున్నారు. రోశయ్య సీ బ్లాక్‌లోకి మారకపోవడం ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రేనంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేయడం, అధికార యంత్రాగం ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించడంలేదనే విమర్శలు వస్తున్న విషయం విదిత


No comments:

Post a Comment