Wednesday, September 30, 2009

దాదా సాహెబ్‌ఫాల్కె అవార్డు

2007 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ఫాల్కె అవార్డును సినీ నేపథ్య గాయకుడు మన్నాడేను వరించింది. సినీరంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే అత్యున్నత పుస్కారమిది.

ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి మన్నాడే పేరును ఖరారు చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చేతుల మీదుగా అక్టోబర్‌ 21న ఈ అవార్డును మన్నాడే అందుకుంటారు. పూర్ణచంద్ర, మహామాయ డే దంపతులకు 1919 మే 1వ తేదీన కోల్‌కతాలో మన్నాడే జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రబోధ్‌ చంద్ర డే. 1950 నుంచి 1970 మధ్యకాలంలో ఆయన ఆలపించిన గీతాలతో హిందీ చిత్రపరిశ్రమ మార్మోగింది. మన్నాడే సుమధుర స్వరం నుంచి జాలువారిన గీతాల సంఖ్య అక్షరాల మూడువేలా ఐదు వందల పైమాటే. 1943లో వచ్చిన 'తమన్నా' చిత్రం ద్వారా ఆయన చిత్ర పరిశ్రమలోకి నేపథ్య గాయకునిగా అరంగ్రేటం చేశారు. 1950లో 'మషాల్‌' చిత్రంలో ఆయన పాడిన 'ఊపర్‌ గగన్‌ విశాల్‌' గీతానికి విశేషమైన ఆదరణ లభించింది.

ఆ గీతం హిందీ చిత్రసీమలో తిరుగులేని నేపథ్యగాయకునిగా ఆయన్ని నిలబెట్టింది. కిశోర్‌ కుమార్‌ వంటి గాయకులతో కలిసి 'యే దోస్తీ హమ్‌ నహీ-షోలే', 'ఏక్‌ చతుర్‌ నార్‌-పడోసన్‌' వంటి బృందగీతాలను కూడా మన్నాడే ఆలపించారు. కొన్ని సందర్భాల్లో హేమంత్‌ కుమార్‌తో కలిసి కూడా ఆయన గేయలాపన చేశారు. 'యారీ హై ఇమాన్‌ మేరా యార్‌ మేరి జిందగీ- జంజీర్‌' వంటి సుమధుర గేయాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. అంతేకాదు బెంగాలీ చిత్రాలకు కూడా ఆయన నేపథ్యగానం చేశారు. బెంగాలీ చిత్రం 'సంఖ్యాయాబేలా'లో లతామంగేష్కర్‌తో కలిసి ఆయన పాడిన యుగళగీతం 'కే ప్రోథోమ కఛ్చే ఇసేఛీ' అత్యంత జనాదరణ పొందింది.

మన్నాడేకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్యారేలాల్‌, కవితా కృష్ణమూర్తి, అనూ మాలిక్‌ తదితర సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

లక్షీకాంత్‌-ప్యారేలాల్‌గా ఖ్యాతిపొందిన సంగీత దర్శక ద్వయంలోని ప్యారేలాల్‌ తన స్పందన వ్యక్తం చేస్తూ 'మన్నాడేకు ఈ పురస్కారం లభించడం ఆనందదాయకం. నేను ఆయనతో కలిసి ఎన్నో గీతాలకు పనిచేశాను. ఆయనకు ఈ పురష్కారం ఎప్పుడో రావాల్సింది. ఆలస్యంగానైనా వచ్చినందుకు సంతోషంగా ఉంది.' అని ప్యారేలాల్‌ హర్షం వ్యక్తం చేశారు. 'ఆయన నాక తండ్రిలాంటివారు. మనం ఆయన సమక్షంలో ప్రదర్శన ఇస్తే కెరిర్‌లో ఉచ్ఛస్థితికి చేరుతామనడంలో సందేహం లేదు. శాస్త్రీయ సంగీతాన్ని అనునిత్యం అధ్యయనం చేస్తూ సామాన్యుల చెంతకు తీసుకెళ్లడంలో లబ్ధ ప్రతిష్టులు. ఆయనకు ఈ పురస్కారం రావడం ఎంతో సంతోషాన్ని కల్గిస్తోంది' అని గాయని కవితా కృష్ణమూర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన్నాడేకు అవార్డు రావడం పట్ల గాయకుడు అభిజీత్‌, సంగీత దర్శకుడు అనుమాలిక్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అవార్డులు
1970 - నేపథ్యగాయకునిగా జాతీయ పురస్కారం - బెంగాలీ చిత్రం నిషిపద్మ
1971 - నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం- హిందీ చిత్రం మేరే నామ్‌ జోకర్‌
1971 - పద్మశ్రీ - భారత ప్రభుత్వం
1985 - లతామంగేష్కర్‌ పురస్కారం-మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం
2001 - ఆనందలోక్‌ అవార్డు-ఆనందబజార్‌ గ్రూప్‌
2003 - అల్లావుద్దీన్‌ ఖాన్‌ అవార్డు-పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం
2004 - జాతీయ పురస్కారం-కేరళ ప్రభుత్వం
2005 - జీవిత సాఫల్య పురస్కారం-మహారాష్ట్ర ప్రభుత్వం
2005 - పద్మభూషణ్‌-భారత ప్రభుత్వం


Tuesday, September 29, 2009

ఇంతటి చెత్త వెదవ ఎక్కడైన ఉంటాడ

Kaya Skin Clinic click and view full image --image by sakshi

ఇంతటి చెత్త వెదవ ఎక్కడైన ఉంటాడ అండి వై.యస్.వంటి మహనాయకుడు ప్రజలకు అన్ని సేవలు అందించిన వాడు హఠత్తుగా మణిస్తే అతనితో పాటు అతని మరణాన్ని భరించలేక అతని అభిమానులు చనిపోతే సహజ మరణాలు కూడ అందులోనే ఉన్నాయ్ అనే చెత్త వెదవని ఇక్కడే అది కాంగ్రెస్ లో ఉండడమనేది అంత దరిద్రం ఎక్కడా ఉండదు ప్రతి దానికి హై కామండ్ అంటున్నారుగా ఎదో సొనియా పొస్టర్ లు చింపినందుకే ఓ తెగ గొంతు చించుకున్నాడుగా కె.కె.మరి అతను ఈ వాఖ్యలన్నిటికి హైకమండ్ ఏమంటుంది చర్యలు తీసుకోదా


జగన్‌కు సీఎం పదవి రాకుండా చేస్తున్నారని రాజశేఖర్ సతీమణి జీవిత

వైఎస్ అనుకూల వర్గం- వ్యతిరేక వర్గం క్రమంగా బయటపడుతున్నాయి. జగన్‌కు అనుకూలంగా గొంతు చించుకుని అరిచేవారు ఒకవైపు కనిపిస్తుంటే... వ్యతిరేకంగా గొంతు పెంచి మాట్లాడేవారు మరోవైపు కనబడుతున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ రెండు ముక్కలయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది.

వైఎస్ మరణానంతరం రోశయ్యకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన దగ్గర్నుంచి... కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నిరసనను వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే వాటన్నిటినీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు.

ఇదిలావుంటే సినీ నటుడు రాజశేఖర్ జగన్‌ను సీఎం చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. జగన్‌కు ఎందుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చాడు.

వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించే సత్తా... ఒక్క జగన్‌కు మాత్రమే ఉన్నదని రాజశేఖర్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. కాంగ్రెస్ అధిష్ఠానానికి కొంతమంది చాడీలు చెప్పి జగన్‌కు సీఎం పదవి రాకుండా చేస్తున్నారని రాజశేఖర్ సతీమణి జీవిత అన్నారు.

Sunday, September 27, 2009

విజయదశమి మంచి రోజా?ఆంధ్రకి

రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణజేటి రోశయ్య సీ బ్లాక్‌ నుంచి తన విధులు నిర్వహించడానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సోమవారంనాడు విజయదశమి కావడంతో ఉదయం తొమ్మిది గంటలకు సీ బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి లభించడంతో జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం విజయదశమి రోజున పూజ అనంతరం రోశయ్య సీ బ్లాక్‌లోకి మారతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో వైపు మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ అక్టోబర్ నెలలో ఉండే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హటాన్మరణానంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన రోశయ్య డి బ్లాక్‌లోని తన పాత ఛాంబర్‌ నుంచే బాద్యతలు నిర్వహిస్తున్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్‌‌ను ముఖ్యమంత్రి కావాలని బలమైన వాదనలు, విన్నపాలు వస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఆదేశిస్తేనే తప్ప సీ బ్లాక్‌లోకి వెళ్లనని రోశయ్య పదే పదే చెబుతూ వచ్చారు.

తాజాగా సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సీ బ్లాక్‌లోకి వెళ్లాలని సూచించడంతో రేపు ఆయన డీ బ్లాక్‌ నుంచి మారనున్నారు. రోశయ్య సీ బ్లాక్‌లోకి మారకపోవడం ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రేనంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేయడం, అధికార యంత్రాగం ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించడంలేదనే విమర్శలు వస్తున్న విషయం విదిత


Saturday, September 26, 2009

a certificate 18 ఏళ్ళు దాటిన వారికే

ముందు రక్తి తరవాత యుక్తి చివరికి మిగిలేది వీరివురిలో ఒకరు

క్రైం వాచ్
పదం మనం ఈ మధ్య మధ్యేంటి చాల రోజుల నుంచే వింటున్నాం కాని అమ్మాయిలపై దాడులు,హత్యలు,దోపిడిలు,ఇవన్ని మాములుగా జరుగుతు వచ్చాయ్.

అమ్మాయిల పై దాడులు జరిగినప్పుడు టి.వి.9 ఒక మీటింగ్ పెడుతుంది అందరూ మహిళ సంఘాలు వారు వస్తారు ఆమె పేరు తెలిదుగాని టి.వి.ఛానల్ పక్కనే ఉన్నట్టు వచ్చేసి ఆమె అందరిని తిట్టేస్తుంటుంది ఇలా ఇవన్ని ప్రతి రోజు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి.

మీకెవరికైన టి.వి.ఛానల్ పెట్టే ఆలోచన ఉంటే దీనిపైన క్రైం మీద పెట్టండి ఈ మధ్య శాడిస్ట్ లు ఎక్కువయ్యారు మీరు గనక ఛానల్ పెట్టిన కొద్దిరోజులకే పేపర్ పెట్టండి కొంచం కొత్తగా ఆలోచించండి ఇదంత ఎందుకంటే చెపుతుంది.

ఈ క్రైం వాచ్ లో చివరికి ఇజ్రాలుకూడ పాల్గొంటున్నారు మేమేమి తక్కువకాదని నిరూపించుకుంటున్నారు గౌతమి ఎక్స్ ప్రెస్ మీద పడి దొంగలు దోపిడి చేసారు రక్తిసాగర్ ఎక్స్ ప్రెస్ లో ఇజ్రా ల విజృంభణ జరిగింది దాదపు 80,000,నాలుగు సెల్ ఫోన్ లు దొబ్బెశారు ఇలా చెపితే!ముందే చెప్పానుగా టి.వి.ఛానల్ పెట్టాలని ఇప్పటికి ఇది.

పైన చెప్పలేదు కాని ఎక్కువగా జరుగుతోంది వివాహేతర సంభందం కారణం గానే హత్యలట

ఈ శారిరక సంభందాల హత్యలు పెరిగే అవకాశం ఉందని ఒక సర్వే తెలుపుతోంది

కాదేది కవితకనర్హం అన్నట్టు కాదేది దోపిడి కి అనర్హం అని దొంగలు ఒక సూక్తి రాసుకొని రెచ్చి పోతున్నారు


Friday, September 25, 2009

ఎయిడ్స్ మహమ్మారికి విరుగుడు



ప్రపంచ వైద్య పరిశోధనల చరిత్రలో మరో కీలక అధ్యాయానికి తెరలేచింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారికి విరుగుడును కనిపెట్టడం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలకు సవాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దీనికి పూర్తి విరుగుడు కనిపెట్టడం సాధ్యపడనప్పటికీ, దాని ముప్పును తగ్గించే వ్యాక్సిన్‌ను మాత్రం శాస్త్రవేత్తలు తయారు చేశారు.

థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కొత్త వ్యాక్సిన్ ఎయిడ్స్ ముప్పును 31 శాతం వరకు తగ్గిస్తుంది. ఎయిడ్స్ వైరస్ త్వరగా వ్యాపించకుండా అడ్డుకునే ఈ వ్యాక్సిన్‌ను థాయ్‌లాండ్‌‍లో 16 వేల మందిపై పరీక్షించి శాస్త్రవేత్తలు ఫలితాలను ప్రకటించారు. ఇటీవల సంవత్సరాల్లో ఎయిడ్స్ వైరస్‌పై జరిగిన పరిశోధనలన్నీ విఫలమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఎయిడ్స్‌ను అడ్డుకునే వ్యాక్సిన్‌ను కనిపెట్టడం సాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య సమాజం భావిస్తూ వచ్చింది.

అయితే బ్యాంకాక్ పరిశోధకులు మాత్రం ఎయిడ్స్ వైరస్‌ను సవాలుగా తీసుకొని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో 16 వేల మంది వాలంటీర్లను భాగస్వాములను చేశారు. హెచ్ఐవీ సోకకుండా 31 శాతం వరకు అడ్డుకునే వాక్సిన్‌ను వారు ఈ పరిశోధనల్లో తయారు చేశారు. ఎయిడ్స్ వైరస్‌ను అడ్డుకునే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను కనిపెట్టడం ఇదే తొలిసారి.

వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వన0



దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి స్మృతి వనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ సమీపంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది.

వైఎస్సార్ అభయహస్తం పథకంలో భాగంగా నవంబర్ ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు నాలుగు లక్షల మంది మహిళలకు పెన్షన్ బాండ్ల పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇంకా చేనేత రుణాల మాఫీపై విధివిధానాలను గురువారం మంత్రి మండలి చర్చించింది.

అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్వైన్‌ఫ్లూ పై విస్తృతంగా ప్రచారం చేయాలని, నిబంధనలకు లోబడే వైఎస్ విగ్రహాల ప్రతిష్టాపన చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. సీనియర్ ఆర్డీవోలను అదనపు జాయింట్ కలెక్టర్లుగా నియమించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చేనేత రుణాల మాఫీ, కరువు, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర అంశాలపై చర్చ జరిగింది.

Wednesday, September 23, 2009

పి.యస్.యల్.వి.సి--2 ప్రయోగం రివ్యూ





నిన్న శ్రీహరికోటలో భారత్ చరిత్రలలో మరో ఘననీయమైన ఘ్టన ఆవిష్కరించబడింది అదే పి.యస్.యల్.వి.సి.2 ఇస్రోకు మరో గొప్ప ఎప్పటికి నిలిచిపోయే ప్రయోగం విజయవంతం ఇస్రో సభ్యులు విజయవంతంగా ప్రయోగించిన పి.యస్.యల్.వి.సి.2 నిర్దేశించిన కక్ష్యలోకి 20 నిమిషలలో చేరుకుంది దీనితోపాటు మరో ఆరు ఉపగ్రహాలు కూడ చేరుకున్నాయ్ వరుసగ 16వసారి పి.యస్.యల్.వి.ప్రయోగం ఈ విజయనంతరం మనదేశ రాష్టపతి,ఉపరాష్టపతి,ఇస్రో చైర్మెన్ మాధవన్ నాయర్,అభినందనలుతెలిపారు ఈ ఏడదిలో మరో రెండుప్రయోగాలు ఇస్రో చేయనుంది నిన్న 11:51నిమిషాలకు బయలుదేరిన పి.యస్.యల్.వి.సి.14రాకెట్ ద్వార ఓషన్ శాట్-2 మరో ఆరు కక్ష్యలోకి చేరుకున్నాయ్ షార్లోని మొదటిలాంచ్ ప్యాడ్ ద్వార బయలుదేరిన రాకెట్ నింగికెగసిన 20 నిమిషాలలో చేరుకుంది 1,081 సెకన్లకు 960కిలోల బరువున్న ఒషన్ శాట్ 2 భూమి నుంచి 728 కిలోమీటర్ల దూరంలోఉన్న సూర్యనువర్తన లోకి చేరుకొంది ఇదంత 20 నిమిషాలలో దేశమంతట ఆనందం వెల్లివిరిసింది ఈ విజయంతో రెండువేళ్ళపదమూడులో చంద్రయాన్-2 ప్రయోగిస్తాం దాని డిజైన్ అంతపూర్తయిందని మాధవన్ నాయర్ తెలిపాడు.


Tuesday, September 22, 2009

ఇదండి కాంగ్రెస్ పార్టి



ఇదండి కాంగ్రెస్ పార్టి వై.యస్ వంటి మహనాయకుడు మరణించి ఒక నెల కూడ కాలేదు సీనియర్లు కొట్టుకునే స్థాయికి దిగి పోయి ఒకరి పై ఒకరు వాఖ్యలు చేస్తున్నారు జగన్ ముఖ్యమంత్రి పదవి పై వీరిలో వీరు కొట్టు కుంటున్నారు కొంత మంది సీనియర్లు జగన్ ని సి.యం కాకుండా చూస్తున్నారు అని అనుమానలు వ్యక్తం అవుతున్నాయ్ కెకె-అంబటి రాంబాబు ఏకంగా మిడియా ముందు కొచ్చి హై కమాండ్ ని అడ్డంపెట్టుకొని తిట్టు కొంటున్నారు ఇంత వరకు చూసిన పార్టి ఇక కనపడదు ఎవరికి వారు వాళ్ళ ప్రత్యేకతను చూపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలో హై కమాండ్ నిర్ణయం పై వీరందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది పై పై న జగన్ సి.యం కావలంటు ఉన్న సీనియర్లు మాత్రం సి.యం కావలని ఆశిస్తున్నారు

జర జాగ్రత్త సీనియర్లు బయట పడితే తప్పదు ముప్పు ఇదే కాంగ్రెస్ సీనియర్ లకు నా సందేశం

Monday, September 21, 2009

హుందా ప్రదర్శించిన చిరంజీవి



తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా తిరుపతి శాసనసభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఆహ్వానం అందలేదు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం లేకపోయినప్పటికీ తాను ఓ సాధారణ భక్తుడిగా స్వామివారిని దర్శించుకుంటానని చిరంజీవి తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమంలోను, రంజాన్ పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన తిరుపతికి వెళ్ళారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా టిటిడి నుంచి ఎలాంటి ఆహ్వానమూ అందలేదన్నారు. నిబంధనల ప్రకారం చిత్తూరు జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు టిటిడి బ్రహ్మోత్సవ ఆహ్వానం పంపించాల్సి ఉంది. బ్రహ్మోత్సవ ఆహ్వానం చిరంజీవికి పంపించకుండా దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ కార్యకర్తలు ఆగ్రహం

Sunday, September 13, 2009

రాహుల్ ప్యుచర్ వల్ల జగన్ సి.యం కి దెబ్బ

కాబోయే రాజకీయాలో ప్రధాన పాత్ర దారిలో నిలవబొయే రాహుల్ గాంధి ప్రతి ఒక్కరిని తన యువ రాజకీయాలలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాడు అందుకు ప్యుహం గానే తన ప్రతి సభలలోను సినిమా యాక్టర్స్ ని తన రాజకీయాలలో క్రీయాశిలంగా వినియోగించుకోవటానికి చూస్తున్నాడు అందులో బాగంగానే మొన్న రజని ని నేడు తమిళ్ హీరో విజయ్ తో మంతనాలు జరిపాడు అవి మరి విజయ్ కి వర్తించలేదు రిసెంట్ గా రాహుల్ తో మీటింగ్ అనతరం విజయ్ మిడియా తో మాట్లడుతు నేను రాజకీయాలలోకి రావట్లేదని స్పష్ఠం చేశాడు నేను రాహుల్ గాంధిని కలవాలని చూస్తున్నట్టు అందుకే ఈ అవకాశం కోసం చూసి తనతో మాట్లడేనని అంతకు మించి రాజకీయాలలోకి వెళ్ళనన్ని చెప్పాడు

ఇదంతా ఎలా ఉన్న రాహుల్ మాత్రం 2014 కల్ల కాంగ్రెస్ లో మంచి పోజిషన్ కి వచ్చి వై.యస్.అనుకున్నాట్టే ప్రధాన మంత్రి అవటానికి తీవ్రంగా కౄషి చేస్తున్నాట్టు ఉంది అందుకే ప్రతి రాష్టంలోని ముఖ్యనాయకులని తన టీం లో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అందుకే మన ఆంధ్రలో ముఖ్యుడైన జగన్ ని తన టీంలో మంచి పొజిషన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు

ఇటువంటి పావులు కదులుతున్నయ్ కాబట్టే సోనియా జగన్ ని సి.యం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తోంది అందుకే ఆంధ్రలో ప్రజలందరూ వై.యస్.వారసుడిగా జగన్ కావలంటు ఉంటే చివరికి ప్రతి యం.యల్.యే,యం.పి లు,యం.యల్.సి అందరూ స్పష్ఠంగా తెలుపుతున్న ఇంత లేటు చివరికి ప్రతిపక్షలు ఒప్పుకుంటున్న ఇన్ని మంతనలు మీటింగ్ లు

14,677సీట్లు మిగిలాయ్

ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్‌ పూర్తయినా సీట్లు భారీగా మిగిలాయి. దాదాపు 14,677సీట్లు మిగలడం గమనార్హంకదూ!. ఎంసిఎలో 14,474, ఎంబిఎలో 203సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఐసెట్‌ రెండోదశ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థుల సీట్లను కేటాయిస్తు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కెసిరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా వారికి కేటాయించిన కాలేజీల్లో ప్రవేశం పొందాలని కోరారు. ప్రవేశం పొందని విద్యార్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌లు పొందడానికి కూడా ఫీజును ఇవ్వకూడదని, ఒకవేళ ఆయా కాలేజీలు అడిగితే సహాయ కేంద్రాలను సంప్రదించాలని కోరారు. మొదటి దశ కౌన్సిలింగ్‌లో 75,549 మంది పాల్గొని 73,51,827 ఆప్షన్లను ఇవ్వగా, రెండో దశ కౌన్సిలింగ్‌లో 42,430 మంది విద్యార్థులు పాల్గొని 55,41,065 ఆప్షన్లను ఇచ్చారని అన్నారు. రెండో దశ కౌన్సిలింగ్‌లో ఎంసిఎలో 287 మందికి మాత్రమే సీట్లను కేటాయించగా, ఎంబిఎలో 7,783 మందికి సీట్లను కేటాయించామన్నారు. మొదటి విడతలో 46,150సీట్లు, రెండో విడతలో 8070 సీట్లను కేటాయించామని వివరించారు. అయినప్పటికీ ఇంకా 14,677సీట్లు మిగిలే ఉన్నాయని అన్నారు.చాల మంచి పని చేశారు ముందుగ చెప్పినట్టుగా కాకుండా సర్టిఫికెట్లు తీసుకోవడానికి 3000కట్టమని అడిగిన వారు ఆన్ లైన్ కౌన్స్లింగ్ తో చతికిలపడిన వీరు కాస్తైన విమర్శలు తగ్గుతాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు మొన్న జరిగిన డిగ్రీ పరిక్షలలో చాల మంది తప్పినట్టు తప్పుడు గా ప్రకటించటంతో ఇన్ని సీట్లు మిగిలాయ్ అనుకుంటున్నాను మరి అన్ని కాకపోయిన కొన్ని అయిన భర్తి అయి ఉండేవి వారి తప్పిదమే వారిని ముంచేసింది


Friday, September 11, 2009

వచ్చేది వచ్చేదే--Roja

ఎవరెన్ని శాపనార్దాలు పెట్టిన నేను కాంగ్రెస్ లోకి వచ్చేది వచ్చేదే అనట్టుగా రోజ చెబుతోంది నేను రాటం మూలంగ వై.యస్.ఆర్ మరణించటం అని గంగా భవాని అన్న వాఖ్యలు ఆమె విజ్ణతకే వదిలేస్తున్నాను వై.యస్ గారిని పార్టి పరంగా దూషించానే తప్ప నాకు ఎటువంటి పగలు లేవని చెప్పింది రాజశేఖర్ గారే నన్ను స్వయంగా రమ్మన్నారని చెప్పింది తాను చేసిన విమర్శలను సైతం ఆయన లెక్క చేయలేదని, దీంతో ఆయన ఎంతటి మహానుభావుడో అర్థం అయ్యిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఓ కార్యకర్తగానే ఉంటానని, పార్టీ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీలోని ఏ ఒక్కరికీ పోటీ కాదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. తనకు పదవులు ఏవీ అక్కర్లేదన్నారు. ఓ ఇంట్లో కుటుంబపు పెద్ద అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉందని ఆమె తెలిపారు. వైఎస్ లేరని తాను మళ్ళీ తెదేపాలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Thursday, September 10, 2009

ఈ రోజు గుర్తుందా

ఈ రోజు గుర్తుందా మనకి కాక పోయిన అమెరికన్లకు ఖచ్చితంగ గుర్తున్నరోజు గుర్తు ఉండవల్సిన రోజు ఇదేరోజు 2001 సెప్టెంబర్ 11 న వారి ఆర్ధిక వ్యవస్తని దెబ్బ కొట్టిన రోజు దీనికి ముఖ్య కారణం ఒసామ బిన్ లాడెన్ దీని ప్లైన్ చేసింది వేరే వారే అయిన దీనికి ఆర్దిక సహయం అందించిన వాడు ఒసామ బిన్ లాడెన్ అలాంటిది మళ్ళి అమెరికన్లు చూడకూడదు అన్న రీతిలో విద్వంసం సౄష్ఠించాడు అతను అనుకునట్టుగానే అమెరికాను తిరుగులేని దెబ్బ కొట్టాడు 19మంది ఉగ్రవాదులు పాల్గొన్న ఈ ప్లెన్ లో 4 విమానలు హైజక్ చేయించి రెండు వ్త్చ్ పై యేం చేశాడు అవి అనుకున్నవిధంగానే విద్వంసం సౄష్ఠించారు ఈ విద్వంసం ద్వార నష్టపోయింది అమెరిక మాత్రమే కాదు ఇందులో మరణించిన వారిలో 90 దేశాలకు సంబందించిన ఉద్యోగులు ఉన్నారు ఇంత వరకు ఇంతటి ఘోరం ఇంతమంది ఒకేసారి మరణించటం మళ్ళీ జరగలేదు ఈ విద్వంసంలో మొత్తం 2993 మంది మరణించారు ఇందులో ఒకే కంపెనీకి సంబందించిన వారు 658మంది మరణించారు ఇదెంతటి ఘొరమో స్పష్టంగా తెలియాలంటే ఈ ఉదాహరణ చూస్తే తెలుస్తుంది ఈ టవర్ యొక్క శిధిలాలను బయటకి తీయడానికి 8నెలలు పట్టింది ఇదేకాదు ఈ శిధిలాలు తీసేటప్పుడు రోగాలతో 353 మంది అమెరికన్ ఫైర్ సిబ్బంది అశువులు బాశారు ఈ సంఘటన తరువాత ప్రపంచదేశాలలోని స్టాక్ మార్కేట్ వారమ్రోజులు స్టక్ అయిపోయాయి
ఇవి కూల్చడానికి 2 ఉపయోగిస్తే మిగతా 2 ఏమ్మయాయ్ ఒకటి అమెరికన్ సైనిక సిబ్బంది యంత్రంగం ఉన్న పెంటగాన్ లోని బిల్డింగ్ వైపు వెళ్ళింది కాని అంతగా ద్వంసం కాకపోయే సరికిదానిని అమెరికన్లు సంవత్సరంలో తిరిగి నిర్మించారు మరొక విమానం అమెరికాలోని పొలాలలో కూలిపోయింది ఇదంత జస్ట్ 18నిమిషాలలో జరిగిపోయింది అమెరిక ప్రజలకు ఎమీ అర్దం కాని పరిస్తితి మిడియాకి ఎమి జరుగుతుందో తెలియని పరిస్తితి సుమారు 10000మంది చనిపోతారు అనుకున్నారు 3000కావటంతో ఉపిరి పీల్చుకున్నారు బాధకరమైన అంతేగ మరి అమెరిక ప్రజలకు శుభవార్త 2012 కల్ల ఈ టవర్స్ తిరిగి నిర్మిస్తారు

ఈ రోజు రోజు మరణించిన వీరందరికి శ్రద్దంజలి వ్యక్తం చేద్దం

కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు


కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు ఎటు చూసిన సంతాపలు,సమ్మెలు,ధర్నాలు,సంతకాల సేకరణలు ఎటుచూసిన ఇవే ఎందుకంటే రాజశెఖర్ రెడ్డి మరణం తరువాత అభిమానులందరు వై.యస్.జగన్ ముఖ్యమంత్రిని చేయాలని.

ఇలా సొనియా గాంధి జాప్యం చేస్తే కార్యకర్తల సమయమనం పోయి అనుచిత కార్యక్రమాలు చెస్తారు అందుకే త్వరగ నిర్ణయం తీసుకోవాలని ప్రముఖులు ప్రతిభావంతులు భావిస్తున్నారు

కాంగ్రెస్ లో ఎవరి భాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు రోశయ్య ముఖ్యమంత్రిగ మంత్రులందరు సంతాపాలలో కార్యకర్తలు ధర్నాలలో మరి కొందరు ప్రముఖులు సంతకాలసేకరణలో మహిళ కార్యకర్తలు రోజ ని ఆడుకుంటున్నారు ఏవి ఎలా ఉన్న మంచి రాజకీయంతో సి.యం.సీట్ అధిష్టించబోయే పర్సన్ రావలని కోరుకుంటు

నా సందేశం రాష్టం అభివౄద్ది పదంలో నడపండి