Tuesday, June 30, 2009

"మనం-మనసంస్కృతి వివాహ భంధం" '

  1. వివాహా మంత్రములు అర్దవంతముగా అర్దం తెలుసుకొని ఆచరించే సాంప్రదాయకమైన అత్యున్నత మానవ వావివరసలు-భందుత్వాలు చలోక్తులతో కూడిన సత్ ప్రవర్తనను-సంస్కృతిని బద్దంగా నడిచే విధానం తెలిపిన వేదములు ఈ ప్రపంచానికే ఆదర్శం.అంతే కాదు స్త్రీకి అత్యున్నత గౌరవం మరియు స్వేచ్చను ఆనాటి వారు ఇచ్చారు ఎలాగంటే ధర్మ,అర్ద,కామములలో స్త్రీ యొక్క అధికారం పూర్తిగా ఉంటుంది అంటే ధర్మమున ఈమెను దాటను డబ్బు ఖర్చు పెట్టే విషయంలోను దాటను సంతౄప్తితో సుఖములలో కూడ ఈమెను దాటను అనే ప్రతిజ్ణ వరునితో చేయిస్తారు.ఈ కన్యదానం సమయంలో కన్యదాత యొక్క పితౄ దేవతలు తరించడానికి వారి ఆనందం కోసం కన్యదాత బ్రహ్మలోక ప్రాప్తి కొరకు కనక ఆభరణాలతో కూడిన తన కూతురిని తనకు అల్లుడు కాబోయే వరునికి పరమేశ్వర సరూపాలైన పంచ భూతల సాక్షిని చేస్తు ఇస్తున్నాను అంటాడు వరుని సుశీలుడు అంటే మంచి గుణములు కలవానికి దుర్ఘుణములు లేనివానికి వెతికి మరి పెళ్ళి చేయాలి అని అంటుంది వేదం అ నవ వధువుతో ఆనందంగా ఐహిక సుఖలు తీర్చుకో మంటాడు సత్ సంతానస్న్ని కనమని చెపుతాడు కన్యదాత కాబట్టి.
ప్రతి మనిషి స్త్రీ ని గౌరవించాలి సథ్గుణాలు తెలుసుకొని పెద్దల యెడల గురువుల యెడ తల్లి- తండ్రులను, అత్త-మామలను,భంధు-మిత్రులను గౌరవిస్తు మనం మన సమాజాన్ని కట్టుబాట్లతో నడిపినప్పుడు మనకి దేశానికి తప్పక శాంతి లభిస్తుంధి




Monday, June 29, 2009

"డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్చు పెడతామనేదే ముఖ్యం"

HOW YOU SPEND YOUR TIME IS MORE IMPORTANT THAN HOW YOU SPEND YOUR MONEY "డబ్బు ఎలా ఖర్చు పెడతామనేదానికంటే సమయాన్ని ఎలా ఖర్చు పెడతామనేదే ముఖ్యం" డబ్బు ఖర్చు అయితే తిరిగి సంపాదించుకోవచ్చు సమయం తిరిగి రాదు అది గుర్తులో ఉంచుకొని మీ జీవితాన్ని గడపండి ఇదే విలువైన సలహ


కనపడని కాంతి

విశ్వంలో మన కంటీకి కనిపించే కాంతి మాత్రమేగాక మనక కనపడని కాంతి కూడ ఉంది కిరణాలు పరారుణ కాంతి అతినీలలోహిత కాంతి వంటీవి మన కంటికి కనిపించని కాంతికి కొన్ని ఉదహరణలు అయితే మనుషులు కంటికి కనిపించని ఈ తరహ కాంతి మిగతా జీవులన్నిటికి కూడ కనిపించకుండ నియామలు ఏమి లేవు శాస్త్రజ్ఞులు ఇప్పటి వరకు చేసిన పరిశోధనలలో కొన్ని జంతువులు పరారుణ కాంతిని ,మరికొన్ని అతినీలలోహిత కాంతిని ఇంకొన్ని ఈ రెండు రకాల కాంతిని చూడగలవని వెల్లడయింది మనుషులు చూడలేని కాంతులు ఇంకా ఉన్నందున శాస్త్రజ్ఞులు పరిశోధనలు మరింతలోతుగా చేయాలి జరపవల్సిన అవసరం ఉంది కూడా


Sunday, June 28, 2009

ప్రతి ఒక్కరికి సలహ

ప్రతి ఒక్కరికి సలహ:
నాయకులకు: ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు మీరు మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మీలో మీరు పోట్లడుకోవడం కాదు ఇకనైనా ప్రజల సమస్యలు పట్టించుకోండి పరిష్కరించండి అప్పుడే మీరు నిజమైన నాయకులు అవుతారు
ద్విచక్రవాహనదారులకు: బండి నడుపుతూ తలకు భూజనికి మద్యలో సెల్ ఫొన్ పెట్టుకొని మాట్లకండి అది ఎంత ప్రమదమో గుర్తించండి డ్రైవింగ్ లో ఉండగా కాల్ వస్తే రోడ్డు పక్కకు ఆపి మాట్లడుకోండి లేదా డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫొన్ స్విచాఫ్ చేయండి ఫొన్ వచ్చింది కదా అని సడెన్ వేయకండి ప్రమదాలకు గురికాకండి

టి.వి.చానల్స్ వారికి: దయచేసి వేసిన సినిమాలే వేయకండి జనాన్ని హింస పెట్టకండి కార్యక్రమాలల్లో స్క్రోలింగ్ యాడ్స్,బ్రేకింగ్ న్యూస్ టి.వి.స్క్రిన్ సగభాగం ఆక్రమించుకుంటున్నాయి ప్రోగ్రాంస్ కనిపించడంలేదు ఆదివారం మంచి పాత సినిమాలు వేయండి దయచేసి ప్రేక్షకుల భాదను అర్దం చేసుకోండి







దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు


దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు విజయవాడ కనక దుర్గమ్మవారికి ఒక అజ్ణాతభక్తుడు అక్షరాల1.25 కోట్ల విలువచేసే బంగారు బిస్క్టెలు బహుకరించాడు ఇంతవరకు దేవాలయచరిత్రలో ఇంత పెద్దమొత్తం బంగారు బిస్క్టెలు బహుకరించడం ఇదే తొలిసారి ఈ సంఘటన శనివారం దుర్గమ్మ హుండి తీసినవారికి దర్శనమిచ్చింది ఆ అజ్ణాత భక్తుని కోరిక అమ్మవారి దేవాలయం ముందు భాగంలో ఉన్న విఘ్ణెశ్వర,సరస్వతీ,లక్ష్మీదేవి,సుబ్రమణ్యేశ్వర స్వామి వార్ల దేవతా ప్రతిమలు బంగారు తాపడం చేయించాలని

కొత్త కొత్త రూల్స్

కొత్త కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి అవిఏమిటంటే డ్రైవింగ్ లైసెన్సె కావలంటే పాన్ కార్డ్ కంపల్సరీ లేకపోతే మీరు ఎన్ని గుర్తింపుకార్డ్లు తీసుకెల్లినా లైసెన్సె రాదు ఇవే కాదు పదోతరగతి పరిక్ష ఐచ్చికం చేస్తున్నారు పదోతరగతికూడ కామన్ ఎశ్ఝం లేకుండ పై తరగతులకు అనుమతి వందరోజుల అజెండాలో దిన్ని కూడ కలిపారు కొత్త కళాశాలలకు కూడ ఇక హుళ్ళక్కే ఇంజనీరింగ్,ఎం.బి.ఎ,ఎం.సి.ఏలకు అనుమతులు ఇవ్వట్లేదు ఇవన్ని కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్ని బాగున్నాయ లేవ

కొత్త గా మరో గుర్తింపు కార్డ్ దినిలో పొందుపరిచే విషయాలు దేశంలో ప్రతి వ్యక్తికీ ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉంటుంది ఇందులో 16అంకెలు ఉంటాయి ఈ సంఖ్య శాశ్వతంగా ...జీవిత కాలం మొత్తం ఉంటుంది ఇందులో మైక్రోప్రాసెసర్ చిప్ ఉంటుంది బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్ర,డీజిటల్ సంతకం ఉంటాయి కార్డుదారుడికి పుట్టిన తేది,ప్రాంతం పొందుపరుస్తారు

Thursday, June 18, 2009

పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు


ఇతనెవరో గుర్తు పట్టేరా మహిళ పై అత్యచారం చేసిన గనుడు బాలీవుడ్ నటుడు
 పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహుజాకు స్థానిక కోర్టు గురువారం వచ్చేనెల రెండో తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.తన పని మనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న నటుడు షైనీ అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు లభించగలవని భావిస్తున్నారు

 


తెలంగాణాలో లోల్లి

తెలంగాణా విమోచన సమితిలో ఎన్నడూ లేని విధముగా కె.సి.ఆర్ పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయ్ తెలంగాణా రాష్ట సమితిలోని సీనియర్ రెబల్స్ జిట్ట బాలక్రిష్ణ రెడ్డి,తెలంగాణ గిరిజనుడు రవీంద్రనాయక్ వీరివురు కె.సి.ఆర్ పై తీవ్రమైన ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సమస్య పై పార్టి సమావేశంలో పాల్గొనటానికి వచ్చిన రవీంద్రనాయక్ ను తెలంగాణా కార్యకర్తలు తరిమి కొట్టారు.దీని పై రవీంద్రనాయక్ కె.సి.ఆర్ పై అట్రాసిటి కేసు పెట్టారు ఇంత జరుగుతున్నప్పటికి కె.సి.ఆర్ ఎటువంటి స్పందన చేయక పోయేసరికి ఈ విమర్శలు నిజమేనన్న భావన కలుగుతోంది కె.సి.ఆర్ మాట్లడకపోయిన తెలంగాణా రాష్ట సమితి సీనియర్ నేతలు వారి వాఖ్యలు అన్ని తప్పని కె.సి.ఆర్ యే ఇప్పటికి అద్యక్షునిగా ఉంటాడని నాయిని నర సిం హా రెడ్డి చెప్పు కొచ్చారు ఇవన్ని ఇలా ఉండగా చిన్నపాటి కార్యకర్తలు ఏమిచేయలో అర్దంకాక పక్క పార్టిలలో చేరెందుకు సన్నదం అవుతున్నారు ఈ పరిస్తితులు ఇలానే కొనసాగితే 2014ఎన్నికలకు తెలంగాణా విమోచన సమితి మరుగున పడు తుందని సీనియర్ తెలంగాణా విమోచనా యోధులు అభిప్రాయపడుతున్నారు

Custom Search


Monday, June 15, 2009

తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం

తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖూలు ఎదురు చుసే వేడుకలలో తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం మన హస్య నటుడు కం హీరో రాజేంద్ర ప్రసాద్ కు 13వ తారీఖు జరిగిన "ఐఫా వేడుకలలో "ఎప్పుడు జరిగే రెడ్ కార్పెట్ ఆహ్వనం కాకుండ అరుదుగా జరిగిన గ్రీన్ కార్పెట్ ఆహ్వనం జరిగింది దీనికి కారణం గ్లొబల్ వార్మింగ్ విషయంలో ప్రజలలో చైతన్య కల్పించేందుకు మన రాజేంద్ర ప్రసాద్ ఇంగ్లిష్ లో తీస్తున్న "క్విక్ గన్ మురుగన్"లోని ప్రసాద్ పాత్ర అలాంటిది. శాఖహరన్ని సమర్దించే పాత్ర ఈ ఐఫా వేడుకులకు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యరాయ్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ తో ముచ్చటించారు.ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి దక్షిణాది గొప్ప నటుడని అందరికి పరిచయం చేశారు ఇంత గొప్ప సత్కారం జరగడం తెలుగు చలనచిత్రపరిశ్రమకు మరింత పేరు తెచ్చిపెడుతుందంటు రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఇలాంటివి మరిన్ని మన తెలుగు పరిశ్రమకు తెలుగు నటులకు జరగాలని రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పారు

ధొని చెత్త కెప్టెన్సి

టీం ఇండియా నిష్కృమణ టీం ఇండియా పేలవ ప్రదర్శన తో 20-20వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది టీం ఇండియా ఇంతటి చెత్త ప్రదర్శనకి కారణం అంతర్గత విబేధాలేన. వరల్డ్ కప్ ప్రారంభం కాక ముందు నుంచే ధొనికి సెహ్వగ్ కి మద్య జరిగిన విబేదం కారణంగానే సెహ్వగ్ టోర్ని నుంచి నిష్కృమించాడు అనుకోవచ్చు ఏది ఎలా ఉన్నప్పటికి నిన్న మొన్న జరిగిన మ్యాచ్లలో ధొని నిర్ణయాల వల్లే ఓడిపోయాం అన్నది ఖచ్చితమైన నిజం. ఒత్తిడి సమయంలో అది ఈ మ్యాచ్ ఓడిపోతే వరల్డ్ కప్ నుంచే వైదొలుగుతాం అని తెలిసి సీనియర్ ఆటగాళ్ళని దించ కుండ 20-20 మ్యాచ్ లు పక్క దేశంలో ఎప్పుడు ఆడని రవీంద్ర జడేజా ని దించి పెద్ద పొరపాటే చేశాడు అటువంటీ ఒత్తిడిని తట్టుకోలేని జడేజా బాల్ టు బాల్ రన్ చేయటంలో విఫలమయి మిగతా బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి తెచ్చాడు దాని మూలంగానే యువరాజ్ ప్రతి బంతిని బౌండరి దాటించలనే తొందరలో ఔట్ అవల్సి వచ్చింది దీనికి తోడు తరువాత వచ్చిన ధొని తన సహజ సిద్దమైన ఆట ఆడకూండ షాట్లు కొట్టడంలో విఫలమయ్యడు యుసుఫ్ ఎంత ప్రయిత్నిచినప్పటికి ఫలితం లేకపోయింది ఇది అంత మ్యాచ్ గురించి అయితే ధొని గురించి వేరుగా ప్రస్తావించుకోవాలి అది ఏమిటంటే ప్రతి మ్యాచ్ గెలిస్తే అది ధొని కెప్టెన్సి వల్లే గెలిచిందంటు చెప్పే అందరు ఇప్పుడు ధొని పై ఈ ఓటమి భాద్యత కూడ ఉంచాలి నిన్న దాక గొడవ పడిన ధొని కి మ్యాచ్ అనంతరం సెహ్వగ్ లోటు తెలిసొచ్చింది మ్యాచ్ అనంతరం సెహ్వగ్ లోటు తీర్చలేనిదంటు చెప్పుకొచ్చాడు ఎప్పుడు పాసిటివ్ గా ఆలోచిస్తడనే ధొని ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తన తప్పుడు నిర్ణయాలతో చేజేతుల మ్యాచ్ని ఇంగ్లాండ్ చేతులలో పెట్టాడు ధొని కిప్పుడు సీనియర్ ఆటగాళ్ళ విలువ తెలిసొచ్చి ఉంటుంది ఇప్పటిదాక తన వెనుకే ఉన్న లక్ ఇప్పుడు ఉంటూందో ఉండదో మరి

Friday, June 12, 2009

పాకిస్థాన్ పై శ్రీలంక విజయం



శ్రీలంక పాకిస్థాన్ పై 19పరుగుల విజయం సాధించింది మొదట్
దిల్షాన్,జయసూర్య మంచి ప్రారంభన్ని ఇచ్చినా సరిగా మిడిల్ 
ఆర్డర్ వినియోగించుకోక పోవడం వల్ల 150పరుగులను మాత్రమే
చేయగలిగింది చేదించగల లక్షమే అయినా పాకిస్థాన్ బ్యాట్స్ మెన్
రాణించలేకపోయారు 19పరుగు చేయవల్సి ఉండగానే ఓటమి పాల
య్యరు కెప్టెన్ యూనిస్ ఖాన్ (38బంతుల్లులో అర్దసెంచరీ) చేసి
ఒంటరి పోరు చేసినప్పటికి లాభం లేకపోయింది బూం బూం అఫ్రిది
బ్యాటింగ్ లో రాణిస్తాడనుకొంటే అసలు బ్యాటింగ్ వదిలేసి బౌలింగ్ 
లో రాణిస్తుండటం పాకిస్థాన్ కు లాభించట్లేదు  



పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది




చార్మినార్ మీద నుంచి యువతిని తోసి వేసి హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది ఎప్పటిలాగే టి.వి వాళ్ళు ప్రేమోన్మాదుల మరో ఘాతుకం అంటు విసౄత ప్రచారం కల్పించారు కాని అసలు సంగతి తెలిశాక ఆశ్చర్య పడ్డారు నిజానికది పాతబస్తీలో జరుగుతున్న ఆరాచక రాజ్యనికి ఒక మచ్చు తునక మాత్రమే అక్కడ ఉంటున్న
అమాయక ముస్లింలను కేవలం ఒక ఒటు బ్యాంకుగా ఉపయోగించుకుంటు ప్రతి అభివౄద్ది కార్యక్రమనికి మొకాల్లడ్డుతు మద్యయుగా
నికి లాగాలని చూస్తున్న నేతాగ్రేసులదే ఈ పాపం జరిగిన సంఘటణ పరిశిలిస్తే అర్షద్ అనే వడ్డి వ్యాపరి దగ్గర మ్రుతి చెందిన సమీరా కుటుంబ సభ్యులు 6000వేల రుపాయలు అప్పుగా తీసుకున్నారు 100కి 40రు.యల వడ్డి వసూలు చేసే ఆ వడ్డి వ్యాపారికి మొత్తం 16000వేలు చెలించాల్సి వచ్చింది అప్పు చెల్లించక పోతే ఇంట్లో వస్తువులతో పాటు మనుషులను తీసుకెల్లడం అక్కడ సర్వసాధారణం దీనికి సోకాల్ట్ నేతలు అండదండలు పుష్కలంగా ఉంటాయి అదే పద్దతిలో బెదిరించి వెళ్ళిన హర్షద్ వడ్డి చెల్లించడనికి వచ్చిన సమీరాని రెండో రోజులు తనవద్దనే వుంచుకొని మూడోరోజు చార్మినార్ పై నుండి తోసేశాడు ఈ సంఘటన్ణ ఒక ఉదాహరణ మాత్రమే పాతబస్తీని తమ సొంత జాగిరుగా మార్చుకోని ప్రభుత్వ అధికారులు సైతం భయపడేల మార్చేశారు అక్కడి దుకాణాల్లో బాలకార్మ్
ఇకులు విపరీతం ఉన్నారు దాడులు చేయలంటే భయం కొత్తగా ఒక పాథశాల ప్రాంభించాలంటే ఈ నేతలకు కప్పం కట్టాలి ఏ గొడవ
జరిగినా వీరే పంచాయితిలు ప్రతి దానికి దాడులు అంతేందుకు ఏలక్షన్లో వ్యతిరేక పార్టి ఏజంట్ గా ఉండే అంతే సంగతులు అభివౄద్ది జరగనివ్వరు జరిగితే తమ హుకుం చెల్లవు ప్రజలలా నిరక్షరశ్యులుగా చాందశులుగా జీవించాలి వడ్డిలు అప్పులు భాదలు గొడవలు అప్పుడే వారికి పంచాయితిలు చేసే అవకాసం ప్రతి చిన్న గొడవని మైనార్టి కన్నులోంచి చూస్తు పోలిసులు వ్యవహరించాలి లేకపోతే రాజావారి ప్రియమిత్రులయినా వీరికి ట్రాన్స్ఫర్ అస్తృఅం సిద్దంగా ఉంటుంది ప్రతి దాన్ని మతం కోణం ఆలోచిస్తు క్రికెట్ మ్యాచ్ జరిగినా ప్రతిసారి భారత జెండలు తగలబెట్టినట్టే అక్కడీ అమ్మయకులు జివీతాలు ఇలా తగలబడూతునే ఉంటాయి