




నా చూట్టూ చైతన్యపు విద్యుత్తు
వాడికొకటే ధ్యాస
కౄరత్వంలో కొత్త పద్ధతులు ఎలా కనిపెట్టాలని
నాకొకటే తపన
అత్యాచారాలన్నింటిని ఎలా అంతమొందించాలని
నరకమంటే కోపం ఎందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా అన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చూట్టూ గాలిలో
చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి క్షణికమైనది
వుంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై.
No comments:
Post a Comment