"హింస" టీవిల్లో వస్తున్న ప్రొగ్రాములని ఒకే పదంలో నిర్వచించడానికి సరైయిన పదం ప్రతీ ఇంట్లో టీ.వీ ఒక నిత్య(అత్య)వసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో,చానళ్ళు చేయు విన్యాసములు పరిపరివిధములుగా చికాకు తెప్పిస్తున్నాయి ఉధా: ఒక్క రోజు TV9 అనబడే పాపులర్ ఛానల్ ని చూడండి,రోజుకి 50తప్పులు డాన్ సినిమా డైరెక్టర్ ఫరాన్ అక్తర్ బోమన్ ఇరాని కొడుకుని నెహ్రు ప్రేమాయణం నడిపింది అనిబిసెంట్ తో అని(అసలు కధనాయకి, లేడిమౌంట్ బాటెన్)ఈలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు,కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా దీనిని అర్దం చేసుకుంటారు ఈ న్యూస్ చానల్స్ మొత్తానికి రోజుకి ఒక్క న్యూస్ చాలు వేసిన క్లిప్పింగ్స్ వేసివేసి చంపుతారు, మొన్న ఈ మద్య ఒక కుర్రవాడు లేడిస్ హస్టల్లోని వాడి ఫ్రెండ్ ని కలుసుకోవడానికి గోడదూకి వెళ్ళాడు దానికి రెండు రోజులు బ్రేకింగ్ న్యూస్ గా వేసి వాడితో మహిళా సంఘాల వాళ్ళతో చర్చ కార్యక్రమలు కేవలం ఒక్క న్యూస్ చానల్ కాదు అందరూ ఈదే న్యూస్ ని వాళ్ళ వాళ్ళ వెర్షన్ లో ఘోరంగా ప్రెజెంట్ చేసారు(బ్యక్ గ్రౌండ్ సాంగ్స్ తో) న్యూస్ ఛానల్స్ పరిస్తితి ఇలా ఉంటే ఇక ఎంటర్ టైనెమెంట్ ఛానల్స్ పరిస్తితి కేవలం సినిమా లోకం చుట్టూ తిరుగుతుంది ఈ మద్య రియాలిటి షోలని తయారయ్యాయి Z తెలుగు ఆట అనే ప్రోగ్రాం చూస్తె నాట్యబ్రుందాలకి ప్రాంతాల పేర్లుపెట్టి రెచ్చగొడుతూ వ్యాఖ్యలు అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్తితులని పాడుచెయ్యడం కాదా ? ఇక"ళ" "ఠ" లాంటి అక్షరాలు కూడా సరిగ్గా పలకడం రాని ఆ యాంకర్ మహనుభావులు సరేసరి ఇంత హింస మద్య భక్తి సంస్క్రుతి ఛానల్స్ లో తెలుగుభాషలో ఉద్ధండులైన వారిచే ప్రసంగింపబడుతున్న ఉపాఖ్యానలు మండు వేసవిలో చిరుజల్లుల్లా అనిపిస్తున్నవి
Tuesday, February 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
సంస్కృతి ఛానల్ మూసేశారట.ఇక భక్తి,టి.టి.డి ఛానల్సే మిగిలాయి.
ReplyDelete