Friday, February 27, 2009
ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు
ఒబామా అధ్యక్ష ఎన్నికలలో గెలవగానే సంబరాలు చేసుకున్నాం మా మీడీయా మరో మహత్మాగాంధీ,నెల్సన్ మండేలా అని ఆకాశానికి కేతైసింది మనరాజకీయనాయకులైతే మేమే అపర ఒబామాలం అని ట్యాగ్ తగిలించేసుకున్నారు అసలు సంగతి ఇప్పుడిప్పుడే అందరికి ఏరకవుతోందీ "ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు" అతనిని అమెరికన్ల ఆవశ్యకత విషయాలు జాబ్ సోర్సింగ్ కి చెక్ పెట్టడం అతని మొదటి ప్రణాళిక దీనివల్ల మన దేశం పై చాలా ప్రభావం పడుతుంది అంతే కాదు మానసికంగా అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు మన వాళ్ళకి దూరం పెట్టడానికి ఇదొక ఆయుధం ఇప్పటి ఆసియా వాసులు మా సంపదని కొల్లగొడుతున్నారని అమెరికన్లు భావిస్తున్నారు ఈ బిల్లుతో వారి మనసులు గెలవడానికి ఒబామా చేసిన ప్రయత్నమే ఇది అమెరికాలో నివసిస్తున్న భారతియుల్లో 15%మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుందని తాజా ఇప్సాస్ సర్వేలో తేలింది h1 వీసాల నిబందనల్ని కఠినం చేస్తు ప్రణాళికలు తయారయ్యాయి మరి ఒబామా వల్ల మనకి ఒరిగిందేమిటి జరగబోయే యేది ఏమిటి ఒకటి మాత్రం ప్రపంచం మొత్తం ఒప్పుకున్న నిజం భారతీయులు ప్రజ్ణావంతులు అద్భుతమైన నైపుణ్యం కలవారు ఎంత దూరం పెడదామన్నా వారి టాలెంట్ వారి టాలెంట్ వారిని గెలిపిస్తుంది ప్రస్తుతానికి మనకి ఏ ఒబామాలు అవసరం లేదు మన ప్రజ్ణ తప్ప
Subscribe to:
Post Comments (Atom)
అవును. ఇది నిజం.
ReplyDelete