Friday, February 27, 2009

వీళ్ళా మన నాయకురాళ్ళు


చీ వీళ్ళా మన నాయకులు వీదినపడి కాట్లకుక్కల్లా తిట్టుకుంటున్నరు వీళ్ళామనని పాలించేది

వీడికేమైన మతిభ్రమించిందా (బాబు మోహన్}

ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు


ఒబామా అధ్యక్ష ఎన్నికలలో గెలవగానే సంబరాలు చేసుకున్నాం మా మీడీయా మరో మహత్మాగాంధీ,నెల్సన్ మండేలా అని ఆకాశానికి కేతైసింది మనరాజకీయనాయకులైతే మేమే అపర ఒబామాలం అని ట్యాగ్ తగిలించేసుకున్నారు అసలు సంగతి ఇప్పుడిప్పుడే అందరికి ఏరకవుతోందీ "ఒబామా అమెరికాకు మాత్రమే అధ్యక్షుడు" అతనిని అమెరికన్ల ఆవశ్యకత విషయాలు జాబ్ సోర్సింగ్ కి చెక్ పెట్టడం అతని మొదటి ప్రణాళిక దీనివల్ల మన దేశం పై చాలా ప్రభావం పడుతుంది అంతే కాదు మానసికంగా అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు మన వాళ్ళకి దూరం పెట్టడానికి ఇదొక ఆయుధం ఇప్పటి ఆసియా వాసులు మా సంపదని కొల్లగొడుతున్నారని అమెరికన్లు భావిస్తున్నారు ఈ బిల్లుతో వారి మనసులు గెలవడానికి ఒబామా చేసిన ప్రయత్నమే ఇది అమెరికాలో నివసిస్తున్న భారతియుల్లో 15%మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తుందని తాజా ఇప్సాస్ సర్వేలో తేలింది h1 వీసాల నిబందనల్ని కఠినం చేస్తు ప్రణాళికలు తయారయ్యాయి మరి ఒబామా వల్ల మనకి ఒరిగిందేమిటి జరగబోయే యేది ఏమిటి ఒకటి మాత్రం ప్రపంచం మొత్తం ఒప్పుకున్న నిజం భారతీయులు ప్రజ్ణావంతులు అద్భుతమైన నైపుణ్యం కలవారు ఎంత దూరం పెడదామన్నా వారి టాలెంట్ వారి టాలెంట్ వారిని గెలిపిస్తుంది ప్రస్తుతానికి మనకి ఏ ఒబామాలు అవసరం లేదు మన ప్రజ్ణ తప్ప

Thursday, February 26, 2009

వై.యస్. మీరు నిద్రపోతున్నారా!

"అవినీతి సామ్రాట్టు"చంద్రబాబు గురించి సాక్షి పేపర్లో పెట్టిన హెడ్డింగ్ లోపల 4 పేజీల్లో బాబు అక్రమాల గురించి చిలువలు పలువలుగా వర్ణిస్తు కధనాలు మొత్తం లెక్క కడితే 20వేల కోట్ల రూపాయల ప్రతిపక్ష నేత స్వాహ చేశారని తేల్చారు మరి ఇప్పటి వరకు ఒక్క విచారణైన జరిగిందా ఒక్క కేసైనా నమోదయిందా శిక్ష సంగతి దేవుడుఎరుగు కనీసం కోర్టులోకైనా హజరు పరిచారా ఎందుకీ తాటాకు చప్పుళ్ళు ఇంత అవినీతి జరిగితే మీరు తీసుకున్న చర్యలేమిటి కేంద్రములో రాష్ట్రములో అధికారంలో ఉండి అయిదేళ్ళలో జరిగిందిఏమిటి మీరు అసమర్ధులా లేక మీ అధికార యంత్రాంగమా ఇలాంటి వార్తలు మీ సొంత పెపర్లొ రాయిస్తున్నారు అధికారంలొ ఉంది మీరా లేక చంద్రబాబా ! ఇంకా ప్రతిపక్ష నాయకుడినే అనుకుంటున్నారా నిజంగా మీరు ప్రజల మేలు కొరె వారైతే కనీసం మిగిలిన ఒక్క నెలలొనైనా ఒక్క కేసైనా నమోదు చెయ్యండి బాబుని జైల్లొ పెట్టించండి లెకపొతే మీరు అసమర్దునిగా ఆ పదవికి అనర్హునిగా ప్రజలు భావిస్తారు మీరిద్దరూ తొడుదొంగలని శాశ్వతంగా ముద్రవేయించుకొంటారు






Wednesday, February 25, 2009

రెహమాన్ కె పాస్ మా హై


"నా దగ్గర డబ్బుంది, కార్లున్నయి, బంగ్లాలున్నాయి నీదగ్గరేముంది"......"నా దగ్గర అమ్మ ఉంది" సలీం జావెద్ ల పాపులర్ డైలాగ్ రెహమాన్ అస్కార్ గెలిచిన వేళ చెప్పిన మాట అమ్మే అతనికి అన్ని నేర్పింది "మా అమ్మ నాకు మార్గదర్శి తను నా బిజినెస్ పార్ట్నర్" ఇవి రెహమాన్ గుండే లొతుల్లొంచి అతని సంగీతం కన్నా హ్రుద్యంగా వచ్చిన మాటలు చిన్న వయసులొ భర్తని కొల్పొయి కుటుంబ భారన్ని మోయాల్సిన పరిస్తితిలొ రెహమాన్ ని మాములు చదువులవైపు కాకుండా సంగీతం వైపు ప్రొత్సహించడం వినటానికి సాదారణంగా వున్నా ఆ పరిస్తితి వుండి ఆలొచిస్తే ఆవిడ ఎంత ధైర్యశాలొ అర్దమౌతుంది బహుశా తను అప్పటికే సహాయ సంగీత దర్శకుడిగా వున్న తన భర్త గురించి కన్న కలల్ని కుమారుడి ద్వార సాకారం చెసుకుందేమొ ఆ కలలే రహమాన్ ని ఇంతదూరం చేర్చి నట్టుంది భారతీయ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వం గా ఎగరడానికి దొహదం చెసినట్టున్నయి ఎవరొ గొప్ప వ్యక్తి చెప్పారు "నువ్వేదయినా కలని నిజాయితీ పట్టుదలతొ కలిపావంటె ప్రపంచం నిన్ను గెలిపించడానికి కుట్ర పన్నుతుంది" బహుశా అందుకేనెమొ చిన్నతనం లొ అన్నికష్టాలు పెట్టి 14 ఎళ్ళకె రెహమాన్ ని కీబొర్డ్ ప్లేయర్ చెయ్యడానికి కుట్రపన్నింది అల్లా రఖా రెహమాన్ గా మార్చింది "అతని సూఫి సంగీతం లొ దైవత్వం ఉంది" పాకిస్తాని సూఫి సంగీత విద్వాంసుడు మునీర్ చెప్పిన మాట ఇది రెహమాన్ సంగీతపు లొతుల్ని తెలుపుతుంది యాద్రుచ్చికంగానొ, దైవెచ్ఛొ అతని మొదటి పాట "జాబిలిని తాకి ముద్దులిడు ఆశ వెన్నెలకు తొడై ఆడుకొను ఆశ " బహుశా రెహమాన్ కి అంతరిక్షమే హద్దేమొ రెహమాన్ ఒక విజేత

మళ్ళీ మొదలు భుముల పంపకం

మళ్ళీ మొదలు నిన్నమొన్నటిదాక సత్యం, మైటాస్ సంగతి మరువనే మరువలేదు అంతలో మళ్ళీ భూముల పంపకం ఇచ్చిన భుముల బకాయిలే వస్తాయో రావో అని ఉంటే కొత్తగా ఇవి.లేపాక్షికి1500వందల ఎకరాలు,ఇచ్చారు వాన్ పిక్ కు మరో224ఎకరాలు పేద వారికి భుములు ఇవ్వడం సంగతి అటూంచి అసలు ఈ పెద్దవారికి భుములు ఇవ్వడం ఆపితే మన ప్రభుత్వానికే మంచిది లేకపోతె (అంతేసంగతులు చిత్తగించవలయును)

Sunday, February 22, 2009

రాహుల్ గాంధి ఒక బుల్లి అక్వెరియం చేప



నరేంద్ర మోడి కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి రాహుల్ గాంధి చేస్తున్న విమర్శలు దేసనాయకులనే కాక రాష్ట్రంలొ కూడా కల్లొలం రేపుతున్నయి "రాహుల్ ఒక బుల్లి అక్వెరియం చేప" అంటు మోడి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలొ ప్రజారాజ్యనికి అనుకూలంగా మారాయి చిరంజీవికి అనుభవం లేదని విమర్శిసి స్తు వస్తున్న కాంగ్రెస్ కు తమ అధినాయకుడికే అనుభవం లేదన్న సంగతి గుర్తుచేస్తు ప్రజారాజ్యం ప్రచారం మొదలు పెట్టింది ఇంతటితొ ఆగని మోడి "మేము ధనవంతుల ఇంట్లొ సుకుమారంగా పెరిగె పువ్వులం కాదు అడవుల్లొ మా అంతట మేముగా పెరిగే రకం " అంటూ తన వాక్ధాటిని చూపించాడు మొత్తానికి ఈ వ్యవహారం ఇతర గురించి నేతల కాంగ్రెస్ వారు మాట్లడకుండా చేస్తొంది

Saturday, February 21, 2009

"జగన్"సాక్షి టి.వి వచ్చేసిందోచ్!



ఇప్పటిదాక సాక్షి పెపర్ మాత్రమే ప్రతి పక్షాలని ఏండగట్టేది ఇతర పెపర్లు దాని యజమానుల నోరు నొక్కడనికి ప్రయత్నించేది మేము తక్కువ తిన్లేదు అని ఆంధ్రజ్యోతి,ఈనాడులు కూడా సాక్షి మీద జగన్ మీద ఆరోపణలు గుప్పించాయి ఇక అయ్యగారు టీ.వి మీడియా లోకి దూసుకోచ్చారు సాక్షి టీ.వి మీరే ప్రత్యక్ష సాక్షి అనే స్లోగన్ లతో మా ఉరంతా హొర్డింగులు పెట్టెశారు క్వాలిటి పరంగా సాక్షి చాలా బావుంది సాక్షి టీ.వి క్వాలిటి కూడా అదరహో అనే లెవల్లోనే ఉంటుందీ ఏటోచ్చి వార్తలే!

Friday, February 20, 2009

బాబు,వై.యస్,రామోజి.ఇక మా టైమొచ్చింది


గత నాలుగున్నరేళ్ళుగా మీరు చేయిస్తున్న హంగామ ఇక ఆపండి,ఒకరి మీద మరోకరు వేల కోట్ల రూపాయల కుంభకోణాల ఆరోపణలు చేసుకుంటున్నారు సాక్షధారలు ప్రతిరోజు పేపర్లలో వేయిస్తున్నారు మాకు అర్దంకాని విషయం ఒకటుంది హెరిటెజ్, మార్గదర్శి అన్ని అక్రమాలు చేస్తున్నాయని రోజు సాక్షి లో వేస్తున్నారు మరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి రామోజి,చంద్రబాబులను అరెస్టు చేయించచ్చు కదా అలాగే వై.యస్ వేలకోట్లు దండేసుకున్నట్లు రోజు ఈనాడు,అంధ్రజ్యోతి లో ఊకదంపుడు ఉపాఖ్యనాలు రాసేబదులు కేద్రంలో చక్రం తిప్పగల బాబు కనీసం ముఖ్యమంత్రి బావమరిది నైనా జైలో పెట్టించలేదె పిచ్చిమారాజు కాబట్టి రామలింగరాజు జైలుకెళ్ళడం గాని ఈ ఇద్దరిలో ఏదో ఒక పక్షం వైపు చేరి ఉంటే ఈగైనా వాలనిచ్చేవాళ్ళ ఇప్పుడిలా రగ్గు కప్పుకుని పడుకునే అవస్థ వచ్చేదా ఇక ఆపండి మీ నాటకలు అందరు తోడుదొంగలే ఒక ఊరీ తోడేళ్ళే జయప్రకాష్ నారయణ్ చెప్పినట్టు ఇద్దరు నిజలే చెబుతున్నారు కాని ఇద్దరిది పబ్బం గడుపుకుని పదవి పట్టుకుని ఊరేగాలని గాని ఒకరినోకరు శిక్షించుకోవాలనే కాదు చంద్రబాబు,వై.యస్.ఆర్ ఇద్దరు ప్రపంచంలోనే మంచి మిత్రులు మన Tom&Jerry లాగానమాట ఒకరి నోకరు తిట్టుకోకుండ ఉండ లేరు కాని ఒకరికోకరు ఎటువంటి హానీ చేసుకోరు మీ పన్నాగాలు మిగతా పార్టిలా కుటిల ఎత్తులు రోజు గమనిస్తున్న ప్రజలు అమాయకులేంకాదు మీరు ఏంత ఖర్చుపెట్టినా,గెలిచెదెవరో ,ఓడెదెవరో నిర్ణయించేసారు ముందుంది ముసళ్ళ Watch the latest videos on YouTube.com
targeting.

Thursday, February 19, 2009

భారత జట్టు మాజి కెప్టెన్ అజరుద్దిన్


భారత జట్టు మాజి కెప్టెన్ అజరుద్దిన్ కాంగ్రెస్ పార్టి లో చేరడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ,వీరప్ప మొయిలీ ,పి.సి.సి.అద్యక్షుడు డి.శ్రీనివాస్ తో సమావేశమయిన అజరుద్దిన్ గురువారం కాంగ్రెలో చేరాడు ఇప్పటి వరకు మెనేజెమెంట్ కంపెనీ నడుపుతున్న అజహర్ ఇప్పుడు రాజకీయాలలో ప్రజ సేవ చేస్తానంటున్నాడు అంతక ముందు (ఇప్పటి వరకు నవజ్యొత్ సింగ్ సిద్దు ,చేతన్ చౌహన్ వంటి వారు రాజకీయాలలో ఉన్నరు

Wednesday, February 18, 2009

పాపం ఆంద్ర

తెలుగుదేశం
ప్రజారాజ్యం
కాంగ్రెస్

ప్రజారాజ్యం మార్పు తీసుకొస్తుంది అని చిరంజీవి వర్గాలు అన్ని భావిస్తున్నాయి ,అలాగే కాంగ్రెస్ వర్గాలు అన్ని తామే గెలుస్తాని,తెలుగుదేశం వర్గాలు అన్ని మేమే గెలుస్తామని చెప్పుకుంటున్నాయి ఇంతకి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈ టి.వి.ల సర్వేలు సరేసరి ఒక టి.వి ఒకటి చెపితే ఇంకొ టి.వి.ఇంకొటి చెబుతాయి మిగతా రాష్ట్రల సంగతి ఎలా ఉన్న మన రాష్ట్రం మాత్రం రాజకీయంతో విల విల లాడుతోంది

తిరుపతి గతి


తిరుపతి లో అరాచకాలు నిత్యం అభివ్రుద్ది పదని విడిచిపెట్టని మన ప్రభుత్వం నిత్యం పూజలతో విరసిల్లే తిరుపతి సంగతి అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కడ మద్యం విచ్చలవిడిగ దొరుకుతోంది అక్కడి ప్రజలు ఈ మద్యం బాబుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నరు. అక్కడికి వచ్చే టూరిస్టులు ఇబ్బంది పడితే మన భారతదేశ పరువు పోతుంది. మనం ఎంతో భక్తి తో పూజించుకొనే శ్రీవారి గుడికి ప్రపంచంలో ఉన్న మంచి పేరు చెడిపోతుంది దీని సంగతి కాస్త రాష్ట్ర ప్రభుత్వంపట్టించుకోవాలి

Tuesday, February 17, 2009

బురద గుంట

మూడు ప్రాంతలు కలగలిసిన ఆంద్ర

రాజకీయాలు బురద గుంట వలె తయారవుతున్నాయి ఒక రాష్ట్ర సి.యం.పదవి కోసం మూడు పార్టిలు తన్నుకులాడుతున్నాయి వై.యస్.ఆర్,చంద్రబాబు,చిరంజీవి ఒకరికిఒకరు పోటి పడుతున్నారు ఒక రాష్ట్రం కోసం ఇన్నితంటాలు పడుతుంటే మద్యలో ఈ తెలంగాణ విషయం రాజకీయనాయకులని అర్దం కాని పరిస్తితి కి తెస్తొంది ఈ విషయం పై ఎవరికివారు చేయిదాటేస్తున్నరు నాకు మాత్రం తెలంగాణ వస్తుందని[2012వరకు] నమ్మకం లేదు.

భూమిక అద్రుష్టం


తన భర్త భరత్ ఠాగుర్ వ్యాపారల విజయవంతం కావడంతో భూమిక ఆనందానికి అవధులు లేవు ఇప్పటికే వెబ్ సైట్,సినిమపాత్రిక,సినిమాబ్యానర్,మినరల్ వాటర్ వ్యాపారలు బాగా ఉన్నాయి అతని మినరల్ వాటర్ కంపెని పేరు ఎలిక్విరి .ఎలిక్విరి అంటే అమ్రుతం అని అర్దం చాలమంది వ్యాపారులు ఈ పేరు అలోచించనందుకు ఇప్పుడు భాద పడుతుంటారు .

ఖమ్మం లో పవన్ పర్యటనలు

ఇప్పటికే అన్న రాకతో సినిమాలను వదిలేసి ప్రజసేవ అంటు రాజకీయాలలోకి వచ్చిన పవన్ ప్రజరాజ్యం పార్టి గెలుపు కోసం తన వంతు క్రుషి చేస్తున్నాడు యువతరాని ఆకర్షిచేందుకు చిరంజీవి పలికిన మంత్రం పవన్ తనకి ఎంత క్రేజె ఉన్న యువతకు వాడి వేడి ఉన్న వాఖ్యలతోకూడిన ప్రసంగలు కావలని తెలుసుకున్న చిరంజీవి తన తమ్ముడు పవన్ ద్వార అ కార్యక్రమన్ని పూర్తి చేస్తున్నాడు అందుకే రాష్ట్రమంత పవన్ పర్యటనలు చేస్తున్నాడు ఇప్పుడు అ పని ఖమ్మం దాక వచ్చింది .

టీ.వి ఛానళ్ళ హింస ?



"హింస" టీవిల్లో వస్తున్న ప్రొగ్రాములని ఒకే పదంలో నిర్వచించడానికి సరైయిన పదం ప్రతీ ఇంట్లో టీ.వీ ఒక నిత్య(అత్య)వసర వస్తువుగా మారిన ఈ రోజుల్లో,చానళ్ళు చేయు విన్యాసములు పరిపరివిధములుగా చికాకు తెప్పిస్తున్నాయి ఉధా: ఒక్క రోజు TV9 అనబడే పాపులర్ ఛానల్ ని చూడండి,రోజుకి 50తప్పులు డాన్ సినిమా డైరెక్టర్ ఫరాన్ అక్తర్ బోమన్ ఇరాని కొడుకుని నెహ్రు ప్రేమాయణం నడిపింది అనిబిసెంట్ తో అని(అసలు కధనాయకి, లేడిమౌంట్ బాటెన్)ఈలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు,కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరైనా దీనిని అర్దం చేసుకుంటారు ఈ న్యూస్ చానల్స్ మొత్తానికి రోజుకి ఒక్క న్యూస్ చాలు వేసిన క్లిప్పింగ్స్ వేసివేసి చంపుతారు, మొన్న ఈ మద్య ఒక కుర్రవాడు లేడిస్ హస్టల్లోని వాడి ఫ్రెండ్ ని కలుసుకోవడానికి గోడదూకి వెళ్ళాడు దానికి రెండు రోజులు బ్రేకింగ్ న్యూస్ గా వేసి వాడితో మహిళా సంఘాల వాళ్ళతో చర్చ కార్యక్రమలు కేవలం ఒక్క న్యూస్ చానల్ కాదు అందరూ ఈదే న్యూస్ ని వాళ్ళ వాళ్ళ వెర్షన్ లో ఘోరంగా ప్రెజెంట్ చేసారు(బ్యక్ గ్రౌండ్ సాంగ్స్ తో) న్యూస్ ఛానల్స్ పరిస్తితి ఇలా ఉంటే ఇక ఎంటర్ టైనెమెంట్ ఛానల్స్ పరిస్తితి కేవలం సినిమా లోకం చుట్టూ తిరుగుతుంది ఈ మద్య రియాలిటి షోలని తయారయ్యాయి Z తెలుగు ఆట అనే ప్రోగ్రాం చూస్తె నాట్యబ్రుందాలకి ప్రాంతాల పేర్లుపెట్టి రెచ్చగొడుతూ వ్యాఖ్యలు అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్తితులని పాడుచెయ్యడం కాదా ? ఇక"ళ" "ఠ" లాంటి అక్షరాలు కూడా సరిగ్గా పలకడం రాని ఆ యాంకర్ మహనుభావులు సరేసరి ఇంత హింస మద్య భక్తి సంస్క్రుతి ఛానల్స్ లో తెలుగుభాషలో ఉద్ధండులైన వారిచే ప్రసంగింపబడుతున్న ఉపాఖ్యానలు మండు వేసవిలో చిరుజల్లుల్లా అనిపిస్తున్నవి

ఆహారమే మనని తింటే ?




ఆహారమే మనని తింటే ?








Monday, February 16, 2009

భారతదేశం చొరవ తీసుకోవాలి




ఉగ్రవాదులని ప్రోత్సహిస్తున్నారంటు కేవలం పాకిస్తాన్ మీద ఆరోపణలు చేస్తు మన కేంద్రనాయకులు కాలం వెళ్ళదీసె కన్నా, ముందు మన దేశంలో మన మద్య తయారవుతున్న మిని పాకిస్తాన్ల సంగతి చూడాలి (ఉధా: హైదరాబాద్ పాత బస్తీ) పోరుగునున్న బంగ్లాదేశె నుంచి వచ్చే అక్రమవలస అరికట్టాలి ఒటు బ్యాంకు రాజకీయాలు మాని ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపాలి అంతేకాని స్వీయరక్షణనే సరిగ్గ చేసుకోలేక పాకిస్తాన్ ఏదో చెయ్యాలని ఎదురు చూడటం ఎడరిలో ఒయాసిస్సు లాంటిదే మనం గమనించాల్సిన విషయం వారనికొక బాంబుపేలుడుకు గురవుతున్న పాకిస్తాన్ మనకెలా సాయపడగలదు ఇజ్రాయెలా చొరవ తీసుకొని ఉగ్రవాద శిబిరాలని ఏరి వేయాలి అంతేకాని దాదాపు ఉగ్రవాదుల, మతచాందస్సుల చేతిలో నడుస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సాక్షాలు చూపుతు ఉగ్రవాదులని అప్పగించమనే తాటాకు చప్పుళ్ళు మానుకోవాలి

మహత్ములంతా అతి సామన్యులే

మహత్ములంతా అతి సామన్యులే?

క్రుషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహపురుషులవుతారు,తరతరాలకి తరగని వెలుగవుతారు ఇక్కడ అతి సామాన్యంగా,సాదసీదగా కనిపిస్తున్న వీరందరు ఆకోవకి చెందినవారే!మనలాంటి వారే

నలుగురు మహాత్ములు

చెగువిరా

మార్టిన్ కింగ్

మహత్మ గాంధీ

అల్లూరి సీతరామరాజు

ఎంటిపరిస్తితి?మహాకూటమి గెలిస్తె

పొరపాటున తెలుగుదేశం పార్టి గెలిస్తె (సి.యం)ఎవరవుతారు. కొన్ని వర్గలు చంద్రబాబు అంటే మరి కొందరు బాలయ్య అంటున్నారు ఇలా ఉన్న తెలుగుదేశం పార్టి మహాకూటమి అని అన్ని పార్టిలను కలుపుకుపోవడం వల్ల వీరిరువురి మద్య పొటి ఎలా ఉన్న మహాకూటమి ద్వార గెలిచిన తెలంగాణ రావటానికి కొంత సమయం పడుతుంది అంతవరకు ఎవరు(సి.యం) ముఖ్యపోటి కె.సి.ఆర్,చంద్రబాబుల మద్య జరుగుతున్నటే.

ప్రజారాజ్యం బి.జె.పితో కలిస్తే తప్పెంటి ?

కాంగ్రెస్ వాళ్ళు బాహాటంగ యం.ఐ.యంతొ పొత్తు పెట్టుకుంటు సెక్యులరిజం అని డప్పుకొట్టుకుంటుంటే ప్రజరాజ్యం మాత్రం బి.జె.పిని అంటరాని పార్టిగా చూస్తు మతతత్వ ముద్ర వేయడం నాకు హస్యాస్పదంగా తొస్తొంది కుహాన లౌకికవాదం మైనరిటీలని వెంటవేసుకుని వారి మీద ఈగ వాలనీయక పోవడం ప్రతి చిన్నవిషయాన్ని భూతద్దంలొ చూసి హిందు ముద్రవేసి రాజకీయం చేసి లబ్ది పొందడమే కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడలైనపుడు ప్రజారాజ్యం బి.జె.పితో కలిస్తె తప్పెంటి సరిగా గమనిస్తె కమ్యునిస్టులు కాంగ్రెస్ లే అసలయిన ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేసిన వాడి ఉరిశిక్షను అమలుచేయడానికి ఒటుబ్యాంకులు పొతాయని భయపడటం ద్వారా ఉగ్రవాదులకు ఎలాంటి సందేశం వెడుతుంది ఇంకొకసారి ముంబాయి లాంటి దాడికి ద్వారాలు తెరవడం కాదా ? ఇలా కొత్త పార్టీలు కూడ కుహాన సెక్యులరిస్టులుగా మారడం భాధాకరం

హాకర్లు మీకు జోహర్లు

హాకర్ మహశయులకు నా విజ్ఞప్తి మీరు మీ విలువైన సమయాన్ని, తెలివిని, సామాన్య బ్లాగర్ల ఐ.డి. లని యుజర్ నేములని కొట్టెసి వారికి చెడ్డపేరు తీసుకువచ్చేబదులు, ఈ దాడి,ఉగ్రవాద వెబ్ సైట్లమీద,పనికిరాని అశ్లీల వెబ్ సైట్లమీద చేస్తే భావుంటుంది.ఇలా మీరు చేసే చిల్లర పనులు ఎంతభాద పెడతాయంటే

1.చిన్న పిల్లాడి చేతిలో ఐసె క్రిం లాక్కునంత
2.తనకు రావల్సిన ఉద్యోగాన్ని రిజర్వేషనెలో మెరిటెలేని వాడు కొట్టెసినంత 
3.వ్రుద్దాప్య పెక్షన్ తీసుకోవడానికి 3 గంటలు లైన్లో నిలబడితే టైమె అయిపోయిందని చెబితే వచ్చే కొపమంత చిరాకుగా ఉంటుంది గమనించండి!
ఈ సలహ మీరు పాటిస్తే అప్పుడు మీకు నిజంగా జోహార్లు

Sunday, February 15, 2009

ఒసామా బిన్ పాంజి

పాపం బుష్

కె.సి.ఆర్ కూతురు కవితకు పనిపాట లేదా ?

కొన్ని రోజులుగా మనం టి.విలలో పేపర్లలో చూస్తున్నాం ఝాన్సీకి నంది అవార్డు ఇచ్చినందుకు కవిత చేస్తున్న హడవిడి అంత ఇంత కాదు,తెలంగాణా యాసలో మాట్లడే హాస్య పాత్రకు గాను ఝాన్సీకీ ఆ అవార్డు ఇచ్చినందున దాన్ని వెనక్కి తీసుకోవాలనీ ఆమె డిమాండ్,అంతేకాదు,ఒక ప్రత్యేకమయిన కమిటీ నియమించి తెలుగులొ విడుదలయ్యై ప్రతి చిత్రాన్ని చూస్తారట అందులో హస్యపాత్రలు,విలన్లు .తెలంగాణ యాసలో మాట్లాడితే మీ పని అంతే సంగతులు అని బెదిరిస్తున్నారు.ఇది ఎంత వరకు న్యాయం,చలన చిత్రాల మాండలికాలు అయా పాత్రలబట్టి సందర్బన్నిబట్టి ఉపయోగిస్తారు అంతేగానీ ఎవరినో కించపరచాలని కాదు,వాళ్ళు డబ్బులు పెట్టితిసేది,డబ్బుసంపాదించడానికేగాని ఇతరుల్ని కించపరచాలని కాదు,ఇలా ప్రతి చిన్న విషయానికి ధర్నలు రాస్తారోకోలు అంటే ఎవరికి నష్టం ఎందుకొచ్చిన గొడవ అని సినిమా వాళ్ళు తెలంగాణా మాండలికాన్ని సినిమాల్లొ రాకుండా చూసుకుంటారు ఈ సాంస్క్రుతిక అణిచివేత వలన ఎవరికి లాభం ఎన్ని సినిమాలలొ శ్రికాకుళం , రాయలసీమ గోదావరి జిల్లాల యాసని విలన్లకి కమెడియన్లకి వాడలెదు ఇలా అందరు రొడ్డెక్కితే తెలంగణా కవులకు నటులకు అవకాశాలు రావు కేవలం తెలంగాణా యాస లోనె మాట్లాడె కమెడియన్లు ఎంతమందిలేరు వారి పరిస్తితి ఏమిటి అమ్మా కవిత ! బ్యూటిపార్లర్ ఉందికద మళ్ళి ఎందుకమ్మ అన్నదమ్ముల్ల విడిపొదాం అనుకుంటున్న వాళ్ళ మద్య మాండలికాల చిచ్చు పెడితే ఎమొస్తుంది