Wednesday, September 9, 2009

వై.యస్ మరణానికి వివరాల వెబ్ సైట్

ఆంద్ర రాష్ట రాజకీయాన్ని మలుపు తిప్పిన వై.యస్ మరణ వార్తకి సంభందించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురించిన దర్యాప్తు వివరాలను తాము వెబ్‌సైట్లో పొందుపరుస్తామని డీజీసీఏ అధికారి త్యాగి తెలిపారు. ప్రమాదంపై ప్రజలకున్న సందేహాలను నివారించేందుకు తాము వెబ్‌సైట్లో ఉంచుతున్నారు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైన పరికరాలు పరిశీలించాకే నివేదిక అందజేస్తామని ఈ బృందం ప్రకటించింది. నేటినుంచే విచారణ ప్రారంభించామని, ఇప్పటికే తమవద్ద కొంత సమాచారం ఉందని వారు పేర్కొన్నారు.అంత వరకు మీడియా ఎటువంటి పుకార్లు పుట్టించవద్దని హిందీలో మాట్లడరని ఎవరికి వారే ఉహగానలు రేపద్దని విజ్ణప్తి చేశారు. సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే మరింత సమాచారం లభ్యం కావచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా ఇలాంటి కేసుల విచారణ మూడేళ్లపాటు కొనసాగుతుందని, ముఖ్యమైన కేసు కావడంతో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. కేసు పురోగతిని తాము వెబ్‌సైట్లో ఉంచేందుకు కసరత్తు చేస్తామని ఆయన వివరించారు. వైఎస్‌ ప్రజాదరణగల నాయకుడైనందున ఆయన మృతికి సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైన ఉందని అతి త్వరగ ఈ కేసు విచారణ పూర్తి చేస్తామని గట్టిగా చెప్పారు అందుకొసమై అందరూ సహకరించాలని తెలిపాడు.



Tuesday, September 8, 2009

ఇది నా విజ్ణప్తి.


ఈ కార్యక్రమం ఎప్పుడైన చూశార టి.వి.1లో టి.వి.9 లో వస్తుంది మళ్ళి వస్తుంది అని అందులో చేసే యాంకర్ కూడా చెప్పాడు మరి అందులో మనకి వెల్తిగా కనిపించేది మన ప్రియతమ నాయకుని క్యారెక్టర్ అయ్యా ,అమ్మ అంటు బట్టి పట్టి చెప్పే డైలాగులు ఇక ఉండబోవు రాష్టానికి అతని సేవేకాక టి.వి.లలో అతని వినోదం కూడా ఆశ్వదించే అవకాశం పోయింది.మళ్ళి మళ్ళి అతని జ్ణాపకాలు వేదిస్తున్నాయ్ వై యస్ అభిమానులు స0యమనం పాటించండి తన ఆత్మశాంతికి పాటుపడండి ఇది నా విజ్ణప్తి.


Monday, July 27, 2009

దొంగ సన్యాసులు మన వై.యస్===బాబులు



నేను మొన్నె చెప్పాను కదండి అస్సెంబ్లీ సమావేశాలలో వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం తప్ప ప్రజలకి ఉపయోగపడే పని ఒకట్టి చేయరు.సభలో వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదన్న చిన్న విషయం కూడ తెలియకుండా ఒకరు మనకి ముఖ్యమంత్రి ఒకరు ప్రతిపక్షనేత అయ్యారు.ఈ తప్పు మన ప్రజలదో ఇ.వి.యంలదో ఇంకా తెలీదుగాని మొత్తానికి వాళ్ళు సమస్యలు మాట్లాడకుండా పోట్లాడుకున్న మనకే నష్టం ఇదంత తెలియనట్టు ఇంట్లో మనుషుల్ల ప్రశాంతంగా సవాల్లు విసురుకుంటున్నారు.

విరికి ఇంత ఖర్చు పెట్టి ఏ.సిలు, మైక్ లు అవసరమ వీళ్ళు ఇరువురు మాటమీద నిలబడి ఎవరోవకరు తప్పుకుంటే కొత్త వారికి చాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కొత్తగా వచ్చినా జయప్రకాష్ నారయణ్ కి చిరంజీవి కి తెలిసినంత కూడ తెలికుండ తిట్టుకుంటుంటే వీళ్ళు నాయకులేన అనే అనుమానం కలుగుతుంది వీళ్ళ గురుంచి అందరికి తెలుసు అయిన చెపుతున్నానంటే కొత్తవారు తెలుసుకుంటారని

"కుక్క తోక వంకర" అన్నట్టు ఏన్ని పేపర్లు,టి.వి లు వీడియోలతోసహా వారి పోట్లాటలు చూపించినా వారు మాత్రం తిట్టుకోకుండా ఉండలేరు ఇదంత ఎందుకంటే నేను టి.వి.9లో వీళ్ళ చెత్తవాగుడు చూశాను మర్చిపోయాను ఉత్తినే తెలుగు1 ఓపెన్ చేయగానే హెడ్ లైన్ గా క్రింద స్టోరి వస్తోంది

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే సభ వాడివేడి చర్చలతో దద్దరిల్లింది. ఇద్దరు ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలి అంటూ సవాల్‌ చేసుకున్నారు. సభలో ఇద్దరి మధ్య జరిగిన వాదోపవాదాల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ ఇద్దరి పరిపాలన, అవినీతిపైనా, అభివృద్ధిపైనా, వెన్నుపోటుపైనా, విశ్వసనీయత తదితర అంశాలపై రిఫరెండం పెడదాం.. బాబు ఒప్పుకుంటే తేదీలు ఇస్తాను.. ఎవరు ఓడిపోతే వారు రాజకీయాల నుంచి బయటకు పోదామా అని ఛాలెంజ్‌ చేశారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఇద్దరి పరిపాలనపైన రిఫరెండం పెట్టడానికి అభ్యంతరంలేదని అన్నారు. దీనిపై బీజేపీ, టీఆర్‌ఎస్‌, ప్రజారాజ్యం, లోక్‌సత్తా పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు. ఛాలెంజ్‌లతే చేసుకున్నారో మరి మాటమీద నిలబెడతారో, లేదో చూడాల్సిందే..




అమరావతి స్తూప ప్రత్యేకత


అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్రదుర్గాలలో ఈ నగరమొకటి.

సుమారు 16 కి. మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపద)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది.

మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది అప్పటికే. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి.

ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845లో, రాబర్ట్ సీవెల్ 1877లో, జేమ్స్ బర్గెస్ 1881లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్‌కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్‌లలో భద్రపరిచారు.

ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారిల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు పీరియడ్స్‌కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ రేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.

అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు 'కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము'.దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానదిపై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.



Saturday, July 25, 2009

1954లోనే దాసరి సుబ్రమణ్యం జానపద ఇంద్రజాలం

దాసరి సుబ్రహ్మణ్యం గారు ... మూడుతరాల చందమామ పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట... జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన మేటి రచయిత. ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు "చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు" దాసరి సుబ్రహ్మణ్యం గారు.

"‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున గుర్తుకొచ్చే కథలు ఏవి అంటే.. శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు." వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారే.

"కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన" తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.

జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు. ప్రపంచానికి హ్యారీ ప్యాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, 'తోకచుక్క'తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో 'భల్లూక మాంత్రికుడు' వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి. ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో రెండు,లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు. వరుస క్రమంలో కాకపోయినప్పటికీ, ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామల మధ్య సాంకేతిక సమన్వయం కుదిరిన మేరకు సుబ్రహ్మణ్యంగారి అలనాటి ధారావాహికలను ఒక్కటొకటిగా ఆన్‌లైన్‌లో ప్రచురించబోతున్నారు.చందమామ కధ వీక్షకులకు ఇదో గొప్ప సదవకాశం ఆన్ లైన్ లోను దాసరిసుబ్రమణ్యం కధలు చదువుకోవచ్చు.



Friday, July 24, 2009

అస్సెంబ్లీ లో wwf ప్రసారాలు

click the image


మళ్ళీ రెడి అవండి అద్భుతమైన ఆఫర్ మీరు ఒన్లీ wwf ని టెన్ స్పొర్ట్స్ లో మాత్రమే చూసేవీలుంది ఇప్పుడది 80చానళ్ళకు ప్రత్యక్ష ప్రసారం కూడా అదేంటొ కాదు మన అస్సెంబ్లీ ప్రసారాలు అన్ని చానళ్ళకు ఇచ్చారు ప్రజకోసం ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ కొట్టు కుంటు తిట్టు కుంటు ప్రజ డబ్బు ని హవా చేస్తు ఇక్కడ కూడ నిమిషానికి3లక్షలు ఖర్చు చేస్తు దర్జాగా గడిపేస్తుంటారు కావలంటే చూస్తు ఉండండి ప్రజల గురించి ఏమి మాట్లాడరు వాళ్ళలో వాళ్ళు కొట్టు కుంటు ఉంటారు ఇందుకోసం కొన్ని హద్దులు పెట్టుకున్నారు అవెంటో ఫోటో ని చూడండి


చరిత్రలో ఈ రోజు 7/24/2009

1890: గ్రంథాలయోద్యమ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మించాడు.


1932: రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.


1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.


1971: మహాకవి గుర్రం జాషువా మరణించాడు.


1998: యుద్ధవాహక నౌక కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.


1992: యూనివర్సల్ పోయిట్రీ ఫౌండేషన్ పూనేలో ప్రారంభమయ్యింది






.