Thursday, July 16, 2009

అమెరికా మొత్తాన్ని భయపెట్టె ఇల్లు

వించెస్టర్ మిస్టరి హౌస్
ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన వారు బయపడకుండా తికమక పడకుండా బయటకు రావడం దాదాపు అసాద్యం 1881 లొ గన్ కనిపెట్టిన ఒలివర్ వించెస్టర్ చనిపోయిన తరువాత అతని బార్య సారా వించెస్టర్ ఈ ఇంటిని కట్టించారు కాని ఆవిడెప్పుడు ప్రశాంతంగా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో నివసించలేదు ప్రతి వారం ఒక కొత్త గదిని కట్టించి అందులోకి మారుతూ ఉండేది ఇలా 1922 లో ఆవిడ మరణించే దాకా అలా 100 కు పైగా గదులు మెట్లు కట్టిస్తున్నే ఉన్నారు వించెస్టర్ కనిపెట్టిన రైఫిల్ వలన మరణించిన వారి ఆత్మలు అమెను వెంటాడతాయని ఆవిడ భయం అలా చాల సార్లు జరిగిందట (కాని అలా వచ్చె ఆత్మలు గోడలనుంచి కూడా వస్తాయి కదా గదులు మారడం వలన ఎలా తికమక పడతాయి) ఆమె మరణించిన తరువాత ఆమె అత్మ కూడా ఈ ఇంట్లొ చాల మందికి కనిపించిందట ఇప్పుడు కాలిఫొర్నియా లోని ఈ ఇల్లు పెద్ద టూరిస్ట్ స్పాట్ ఇప్పటికి ఆత్మని చూశామని రొజుకొకరైనా చెబుతుంటారు







మెగాస్టార్ అరెస్టయ్యారోచ్


మెగస్టార్ రాజకీయలోకి అడుగుపెట్టిన తరవాత మొదటి సారి అరెస్ట్ అయ్యారు అధిక దరలపై దర్నా చెస్తున్న ఆయన్ని పొలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పి.యస్ కి తరలించారు కాని చిరు అలా అరెస్ట్ అవడం లో కూడా తన స్టైల్ నిలుపుకున్నారు విపరీతమైన ప్రజాదరణ వున్న ఈ మాజి హీరొని అక్కడనుంచి తరలించడానికి పొలీసులు చాలా ఇబ్బంది పడ్డారు చిరు మాత్రం మిగతా నాయకుల్లా చిన్న పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళెటప్పుడు ఈడ్చుకెళ్ళినట్టు కాకుండా హుందాగా ప్రవర్తించారు పొలీస్ వ్యాన్లోకి వెళ్ళి కూర్చున్న ఆయన అక్కడినుంచే నినాదాలు చేసారు ఇక్కడ మాత్రం అయన కొంచం అపరిపక్వంగా కనపడ్డారు ఇంకా కొంచం అలవాటు పడాల్లేండి



Tuesday, July 14, 2009

సిల్లి సండేశాలు:2

విటమిన్లలో మొదటకనుగొన్నది "బి 1"






బొమ్మలు సేకరించే అలవాటున్నవారిని 'ప్లాంగోనాలజిస్ట్'అంటారు

సుమేరు నాగరికత కాలంలో 'బిర్' కు కూడ ఒక దేవత 'నింకాశీ అనే పేరుతో ఆ దేవతను కొలిచేవారు సుమేరియన్లు

సగటున 70కిలోల బరువుండే వ్యక్తి అస్తిపంజరం 13కిలోలు ఉంటుంది.

ఒలింపిక్స్ లో మొదట ప్రవేశపెట్టిన తొలి బౄంద క్రీడలు.....సాకర్ వాటర్పోలో

జనాభా నిష్పత్తి లో ప్రతి ఐదుగురిలో ఒకరు చైనీయులే

ప్రముఖుడి మరణం ఎప్పుడు మిస్టరీయే









ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్లీ మరణం కూడా మిస్టరీగానే మిగిలింది. ఈ మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు, డాక్టర్లు సంవత్సరాలకొద్దీ విచారణలు నిర్వహించారు. ఇప్పటికీ వీటి నిగ్గును తేల్చలేక పోయారు. ప్రపంచ బాక్సింగ్ విజేత మహ్మద్ ఆలి మరణం కూడా అనుమానాస్పదంగానే మిగిలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ఎఫ్ కెనడీని బహిరంగంగానే తుపాకీతో కాల్చి హత్యచేశారు. ఈ హత్యకు దారితీసిన కారణాలు ఇప్పటికీ వెలుగుచూడలేదు. భారత స్వాతంత్య్ర సమర సమయంలో సుభాష్‌చంద్రబోస్ అంతర్ధానంపై కూడా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఆయన ఏ విధంగా మాయమయ్యారో ఇప్పటికీ తేలలేదు. ఆయన బ్రతికే ఉన్నారా ? లేక బ్రిటీషీయులు అంతం చేసారా ? అన్నది కూడా ఇతమిద్దంగా తేల్చలేదు. తాష్కంట్‌లో భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి హఠాన్మరణం కూడా అనేక సందేహాలకు తావిచ్చింది. ఆయనది సాధారణ మరణం కాదని విషం కలిపిన ఆహారం వల్లే ఆయన మృతిచెందారన్న ఆరోపణలున్నాయి. అటు సోవియట్, ఇటు భారత్ కూడా శాస్త్రి మృతిపై చేసిన పరిశోధనలను బహిర్గతం చేయలేదు. ప్రభుత్వాలు వెల్లడించిన సమాచారం ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేదు. సాంకేతిక పరమైన ఆధారాలుంటే తప్ప ప్రజలు దేన్నీ నమ్మే పరిస్థితిల్లోలేరు. అలాంటి సాంకేతిక ఆధారాలను ప్రజల ముందుంచడంలో ప్రభుత్వాలు, నిపుణులు విఫలం కావడంతో ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఇటీవలె ఇరాన్‌లో జరిగిన ఎన్నికలు కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయాయి. అక్కడ అధికార పార్టీ తిరిగి గెలిచినప్పటికీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని ప్రజలను ప్రభుత్వం నమ్మించలేక పోయింది. భారత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. దేశం మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను వినియోగించారు. అయితే ఈ మిషన్‌ల టాంపరింగ్‌కు అవకాశం ఉన్నట్లు సందేహాలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాలను ప్రజలు విశ్వసించలేక పోతున్నారు. ఇవిఎమ్‌ల పనితీరుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇవిఎమ్‌ల టాంపరింగ్‌కు అవకాశం ఉందంటూ జనవిజ్ఞాన వేదిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. దీంతో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది.పంచంలో ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్న ప్రముఖుల మరణాలు...1135లో ఇంగ్లాండ్‌రాజు హెన్రీ ఒ విషాహారంతోనే చనిపోయినట్లు సందేహం.
1327లో ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ ఒఒ అతని భార్య విసాబెల్లా, ఆమె ప్రియుడు రోజర్ మార్ట్‌మేర్‌ల చేతుల్లో హత్యకు గురైనట్లు సందేహం.
1556లో మొగల్ సామ్రాట్ హుమాయూన్ మరణం కారణం ఇప్పటికీ తేలలేదు.
1559లో ఫ్రాన్స్ రాజు హెన్రీ ఒఒ ఒక మ్యాచ్ చూస్తుండగా బాణం తగిలి మృతి చెందారు. ఇది ఇప్పటికీ మిస్టరీ మృతిగానే ఉంది.
1599 బర్మారాజు బాయిన్‌నందా నవ్వుతూనే ఆకస్మికంగా చనిపోయినట్లు ప్రపంచానికి వెల్లడించినా ఇంకా ఈ మృతిపై సందేహాలున్నాయి.
1882లో బేస్‌బాల్ క్రీడాకారుడు జింగ్ క్రేగ్‌టర్న్ ఆకస్మిక మృతిపై సందేహం నెలకొంది.
1935లో బేస్‌బాల్ క్రీడాకారుడు లెన్‌కోయిన్‌చే విమానంలో పైలెట్‌తో చోటు చేసుకున్న ఘర్షణలో మృతిచెందాడు.
1960లో జపానీస్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఇనేజిరో అసానుమా మృతిపై ఇప్పటికీ సందేహాలు కొనసాగుతున్నాయి.
1960లో ప్రముఖ పాప్‌సింగర్ ఎల్విస్ ప్రిస్లే మరణం ఇప్పటికీ మిస్టరీగానే వుంది.
1967లో నాసాఅస్ట్రోనాట్స్ గుస్‌గ్రిసం, ఎడ్వయిట్‌రోజర్, బి చాపెల్‌లు అపోలో ఒ స్పేస్‌క్రాఫ్ట్‌లో మృతిచెందడంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
1993లో బ్రూస్లీ కుమారుడు బ్రాండన్‌లీ ది క్రో చిత్ర షూటింగ్‌లో ఉండగా కాల్పులకు గురయ్యాడు. దీని వెనుక కారణాలు ఇంకా వెల్లడికాలేదు.








Monday, July 13, 2009

సిల్లీ సండేశాలు


చీర్ లీడర్ అనగానే ముందుగా అందమయిన అమ్మయిలే గుర్తుకొస్తారు 1898లో అబ్బాయిలే చీర్ లీడర్స్ తెలుసా ప్రస్తుతం అబ్బాయిల 3%కిపడిపోయారు.


పుట్టిన రెండు నెలలకు గాని కుక్కలు తోక ఉపవు.


కోడి గుడ్డు పై ఈకలు లేనట్టే రంధ్రాలు లేవనుకుంటారు కదూ!కాదండి మనకి కనిపించనివి 7000 రంధ్రాలు ఉంటాయ్.


టర్కీ కోడి గుడ్లు పెట్టే గూడును క్లచ్ అంటారు.


మీరు ఏ రంగు టై వాడుతున్నారు ఎరుపు,నీలం అయితే వెంటనే మార్చుకోండి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా వాడే టైల రంగు ఆరంగులే మీరు ఆ రంగు మార్చుకోక పోతే కొత్తగా ఆలోచించనట్లే.
మీకు ఇంగ్లిష్ వచ్చ అయితే మూడు అచ్చులు వరసగా వచ్చే పదాలు ఆంగ్లంలో ఎన్ని ఉన్నాయ్ చెప్పండి? తెలియకపోతే ఈ అక్షరాలు తిరిగిరాసుకోండి....

suoimetsba suoitecaf


ఇనుముకన్న మనిషి ఎముక గట్టిది

Sunday, July 12, 2009

వదల "రామోజీ" నిన్ను వదల








రామోజీరావు పై ఎప్పటినుంచో సీరియల్ చేస్తానంటూ చెప్పుకొస్తున్న ఉండవల్లి త్వరలోనే ఆ ఆలోచనలకు ప్రాణం పోసేటట్లు కనపడుతున్నారు. టీవీ కోసం తానొక సీరియల్ నిర్మ్ణానికి సిద్దమయ్యాడు. రామోజీ జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సీరియల్ ఉండబోతోందా అని అనుకుంటే, రామోజీతో రాజీలేని పోరాటంతోనే తన పేరు బాగా ప్రచారం లోకి వచ్చిందనీ, దీంతో తాను తీసే సీరియల్ రామోజీపైనే ఉండబోతోందని అనుకుంటే ఎలా అని అని నర్మగర్భంగా అనుకుంటునాడు ఉంటుందనే తెలుస్తోంది.సమకాలీన రాజకీయ అంశాలతో ఈ సీరియల్ ఉంటుందనీ, ఇందులో చాలా పాత్రలే ఉంటాయనీ అనుకుంటే అచ్చంగా రమోజీ పై తీసినదే.
అలాగే ఇప్పటికే ఆ సీరియల్ కోసం ఇరవై ఎపిసోడ్లు వరకూ రెడీ అయ్యాయి.ఉండవల్లి దగ్గర ఒక సినిమా తీసేందుకు అవసరమైన మంచి స్క్రిప్టు కూడా ఉందంట, ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే సినిమా తీయాలనుకుంటున్నాననీ మరో బాంబు విసిరాడు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఇష్టమనీ, అసలు జనాలకు బాగా చేరువ కావాలంటే సినిమాకు మించిన మాధ్యమం లేదనీ చెప్పుకొస్తునాడు. ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర రామోజీ శైలికి అనుకరణ. ఆ పాత్రకి రాఘవేంద్రరావు అనే పేరు పెట్టారు. అయితే అప్పట్లో ఆ సీరియల్‌ను ప్రసారం చేయడానికి ప్రధాన టీవీ చానళ్లేవీ ముందుకు రాలేదు. రామోజీతో గొడవకి అవేవీ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో కొంత కాలం నుంచీ ఆ సీరియల్ డబ్బాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఉండవల్లి ముఖంలో ఆనందం తొంగి చూస్తోంది.కారణం సమీప భవిష్యత్తులో ఆ సీరియల్ వెలుగు చూసే అవకాశం ఉండటమే. వైఎస్ జగన్ ప్రారంభించిన సాక్షి చానల్‌లో అది ప్రసారమయ్యే అవకాశాలున్నట్లు ఆ మధ్య చెప్పుకొన్నారు. అయితే ఈరోజు టీవీ ఛానెల్స్ పెరగటంతో ఏదో ఒక కాంగ్రేస్ హవా ఉండటంతో ఏదో ఒక చానల్లో (కాంగ్రెస్ సపోర్టు ఛానెల్) లో వేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే మరోసారి రామోజీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు

.


Saturday, July 11, 2009

కాంగ్రెస్ పై చిరు తనదైన శైలిలో ద్వజమెత్తరు

రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలిటిక్స్‌ను పాలిట్రిక్స్‌గా మార్చాడని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. ఎన్నికల ముందు సాధారణంగా ఉండే రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే దిశలో ఉన్నాయన్నారు. రాజకీయ అస్తవ్యస్థతకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలతో మమేకం కావాలే కానీ, రాష్ట్రంలో ఇతర పార్టీలనేవి లేకుండా చేయాలని ఆ పార్టీలు అడ్డుకాకుండా చూడాలి, ప్రతిపక్ష పార్టీలు ఉంటే మళ్ళీ అధికారంలోకి రాలేమేమో? అనే భయంతో ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలనే విధానం సరికాదన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అదే ఆపరేషన్ పేరుతో ఏమీ లేకుండా చేస్తారనే విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి మునుపెన్నడూ లేదని, ఎవరొస్తే వాళ్ళు రానివ్వండి పార్టీలో చేర్చుకుందాం అనే విధానం కొత్తగా చోద్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారంలోకి తెచ్చింది ప్రజాసమస్యలు లేకుండా చూడాలని కానీ, ఆ పార్టీ బలంగా తయారు కావాలి భవిష్యత్‌లో కూడా కలకాలం అధికారంలో ఉండాలని కాదని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు భయాందోళనకు గురవుతున్నా రన్నారు. కందిపప్పు, బియ్యం, చక్కెర వంటి నిత్యావసర వస్తువులు సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయాయి, కూరగాయలు వండాలంటే ప్రస్తుతం ఒక విలాశవంతమైన జీవితంలా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలను పరిష్కరించ డంలో ప్రభుత్వం విఫలమైందని దీనికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ దాడులు నిర్వహించి వేల, లక్షల టన్నుల నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వచేసే వారిని పట్టుకుంటుందని, ఈ పట్టుకున్న నిల్వలను వారిపై ఫెనాల్టిద్ వేసి వారికే అప్పగించడం వల్ల ఆ భారమంతా ప్రజల మీదే పడుతుందన్నారు. స్వాధీనం చేసుకున్న నిత్యావసర వస్తువులను బహిరంగ మార్కెట్‌లో ప్రభుత్వమే విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారాజ్యం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యమంత్రి విహార యాత్రలను వెళ్ళడం, విలువైన సమయంలో జన్మదిన వేడుకలు నిర్వహించడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మీ మానాన మీరు పొండి అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉందని ఆయన మండి పడ్డారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం వారికి సరిపోను విత్తనాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 17 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా 14 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం చెబుతూ ఉందని, మిగిలిన విత్తనాలు ఎవరివ్వాలని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షిస్తే ప్రయోజనం ఏమిటన్నారు. దేశంలో ఆహార ఉత్పత్తుల పెరుగుదల రేటు నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా రాష్ట్రంలో 1.8 శాతం మాత్రమే ఆహార ఉత్పత్తుల పెరుగుదల కనిపిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు లేవని చెప్పడానికి వీలు లేదని, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్భాటంగా చేపట్టిన జలయజ్ఞానికి కేంద్రం నుండి నిధులు తేవడంలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం మొండి చేయి చూపిందని, ఈ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాను ఉపయోగించుకొని తమ పార్టీ నుండి కొందరు నాయకులు బయటకు వెళుతున్నారంటూ లీకులు చేసి ప్రచారం చేస్తున్నారని చిరంజీవి ఆరోపించారు. తమ పార్టీని అస్తవ్యస్థం చేసేందుకే ఇటువంటి ఛీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము పార్టీ నుంచి వెళ్ళిపోవడం లేదని తమ పార్టీ నాయకులు పత్రికా ప్రకటనలు పంపినా, విలేఖరులకు నేరుగా చెప్పినా కూడా అంత ప్రచారం ఇవ్వడం లేదని కానీ, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే మాత్రం ప్రచారం చేస్తున్నారని ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో చంద్రబాబే ఆధ్యుడని చిరంజీవి ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, రాజకీయ పరిణితిని రాజకీయ లబ్ధికే వాడుకుంటున్నాడని ఆయన అన్నారు. పార్టీ ప్రతిష్ఠతపై ఆయన దృష్టిసారించాలే కానీ, ప్రతిపక్ష పార్టీల నుండి నాయకులను ఆకర్షించడం విజ్ఞత కాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఐక్యం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎన్నికల ముందు మహాకూటమిని ఏర్పాటు చేసినట్లుగా ఇప్పుడు కూడా ప్రతిపక్షాలన్నింటినీ లుపుకుపోయి ప్రభుత్వంపై ఉద్యమించాలని, అది నిజమైన ప్రతిపక్ష నాయకుడి లక్ష్యమని కానీ, కాంగ్రెస్ ట్రాప్‌లో పడి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. అప్పుడు అధికారం కోసం చంద్రబాబు ఈ ప్రయత్నం చేశాడని కానీ, ఇప్పుడు ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చంద్రబాబు రాజకీయ పరిణితిపై, ఆయన మానసిక పరిస్థితిపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన రీతిలో ఆయన ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానిస్తూ పరోక్షంగా చంద్రబాబుకు మతి భ్రమించిందనే రీతిలో చిరంజీవి మాట్లాడారు. తమ రాజకీయ సుస్థిరతల కోసం ప్రయత్నించడంలో చంద్రబాబుకు, వైఎస్‌కు తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని ఆయన మండిపడ్డారు........